Bigg Boss 9 Telugu Nominations: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) దాదాపుగా క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక కేవలం నాలుగు వారాలు మాత్రమే మిగిలింది. ఈ నాలుగు వారాల్లో టాప్ కంటెస్టెంట్స్ గా పిలవబడే వారిలో ఎలిమినేషన్ ఉంటుంది. గత వారం జరిగిన నామినేషన్స్ లో గౌరవ్ మరియు నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్ బదులు దివ్య ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమె ఆడియన్స్ దృష్టిలో చాలా నెగిటివ్ అయ్యింది,అంతే కాకుండా గేమ్స్ కూడా పెద్దగా ఆడలేదు. కానీ నిఖిల్ మాత్రం అన్ని గేమ్స్ దుమ్ము లేపేసాడు. అతని గ్రాఫ్ బాగా పెరిగి ఉంటుందని అనుకున్నారు. కానీ ఓట్లు మాత్రం పడలేదు, ఎలిమినేట్ అయ్యాడు. ఇక 11వ వారానికి సంబంధించిన నామినేషన్స్ షూటింగ్ నిన్న పూర్తి అయ్యింది. ఈ నామినేషన్స్ చాలా నాటకీయ కోణం మధ్య జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో ఒకసారి చూద్దాం.
గత 11 వారాలుగా నామినేషన్స్ నుండి తప్పించుకుంటూ వస్తున్న ఇమ్మానుయేల్ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చాడు. భరణి ఇతన్ని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్, భరణి, సంజన మరియు దివ్య నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో దివ్య తప్ప మిగిలిన వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్. మొదటి స్థానం లో అందరూ ఊహించినట్టు గానే పవన్ కళ్యాణ్ అత్యధిక ఓట్లతో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానం లో భరణి కొనసాగుతున్నాడని టాక్. ఎందుకంటే తనూజ నామినేషన్స్ లో లేదు కాబట్టి ఆమె ఓటింగ్ మొత్తం అత్యధిక శాతం భరణి కి పడుతున్నాయి అట. రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉండుంటే తనూజ ఓటు షేర్ డివైడ్ అయ్యేది. రీతూ నామినేషన్స్ లోకి వచ్చిందట కానీ , తనూజ తనకు ఉన్నటువంటి కెప్టెన్సీ పవర్ ని ఉపయోగించి సేవ్ చేసిందట.
ఇప్పుడు ఆమె ఓటింగ్ మొత్తం భరణి కి అత్యధిక శాతం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరియు డిమోన్ పవన్ వంటి వారు కూడా ఆమెకు స్నేహితులే కాబట్టి, వాళ్లకు కూడా ఈమె ఓటింగ్ కొంత డివైడ్ అవ్వొచ్చు. ఇక మూడవ స్థానం లో డిమోన్ పవన్ కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో ఇమ్మానుయేల్, 5 వ స్థానం లో సంజన, ఆరవ స్థానం లో దివ్య కొనసాగుతుంది. వాస్తవానికి ఇమ్మానుయేల్ ఇస్తున్న పెర్ఫార్మన్స్ కి ఆయన మొదటి స్థానం లో కూర్చోవాలి. కానీ నాల్గవ స్థానానికి పడిపోవడానికి కారణం ఇన్ని రోజులు నామినేషన్స్ లో లేకపోవడమే. ఏది ఏమైనా ఇది ఆయనకు డేంజర్ బెల్, ఇక నుండి నామినేషన్స్ లోకి రాకపోతే, ఆయన టాప్ 5 కి కూడా రాకుండా ఎలిమినేట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.