Varanasi Movie OTT Rights : ప్రస్తుతం ఓటీటీ సంస్థలు ఒకప్పటి లాగా నిర్మాతలు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చే పరిస్థితిలో లేవు. కేవలం సినిమా థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత మాత్రమే ఒక మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాళ్లకు కచ్చితంగా ఒక సినిమా మీద అపారమైన నమ్మకం వస్తే మాత్రం అడిగినంత డబ్బులు ఇవ్వడం లో వెనకాడడం లేదు. రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 130 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంతకు ముందు ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం 160 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమాలకు ఎందుకంత డిమాండ్ అంటే, పెద్ది చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ మరియు ‘చికిరి చికిరి’ పాట సెన్సేషనల్ హిట్స్ గా నిలిచి సినిమా పై అంచనాలను ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేలా చేశాయి, అందుకే అంత రేట్ పెట్టి కొనుగోలు చేశారు.
అదే విధంగా ‘స్పిరిట్’ చిత్రం 160 కోట్లకు అమ్ముడుపోవడానికి కారణం, అంతకు ముందు ఆ చిత్ర దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా, నెట్ ఫ్లిక్స్ లో కూడా రికార్డ్స్ ని నెలకొల్పడం తో అడిగినంత డబ్బులు ఇచ్చేసారు. ఇప్పుడు రాజమౌళి(SS Rajamouli) ‘వారణాసి'(Varanasi Movie) చిత్రానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ అన్ని భాషలకు కలిపి 650 కోట్ల రూపాయిలను నిర్మాతలకు ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ మేకర్స్ ఇంకా మంచి డీల్ కోసం ఎదురు చూస్తున్నారట. అంటే కేవలం ఓటీటీ రైట్స్ ని వెయ్యి కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నారట. #RRR చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్స్ ని మేకర్స్ ‘వారణాసి’ కి కేవలం ఓటీటీ నుండి లాగాలని చూస్తున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ సంస్థ అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
ఇప్పటి వరకు అత్యధిక రేట్స్ కి అమ్ముడుపోయిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో కల్కి చిత్రం మొదటి స్థానం లో ఉంటుంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ 375 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అదే విధంగా KGF చాప్టర్ 2 ని 320 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, #RRR చిత్రాన్ని 300 కోట్లకు కొనుగోలు చేశారు. #RRR హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో సునామీ నెలకొల్పింది అనే చెప్పాలి. ఏకంగా సంవత్సరం పాటు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. పశ్చిమ దేశానికీ చెందిన ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. అందుకే ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఆ రేంజ్ లో హిట్ అయ్యింది కాబట్టే ‘వారణాసి’ చిత్రానికి అంతటి ఆఫర్ ని ఇచ్చారు అంటున్నారు విశ్లేషకులు.