Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో ఏ చిన్న అప్డేట్ లీక్ అయినా, నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయిపోతుంది. అసలు ఈ సినిమా విడుదల అవుతున్నది వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీనా?, లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 7న విడుదల అవ్వబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా ని ఆ రేంజ్ లో రూల్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం లో ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ గానే ఒక ప్రముఖ హాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి, ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కలిసి కూడా ఒక హాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ రెండు ఇంటర్వ్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన బిట్స్ కనిపిస్తున్నాయి. దీనిని బట్టీ ఈ సినిమాకు ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు తో కలిపి, ముగ్గురు సూపర్ స్టార్స్ ఉన్నారు. ఒకరు ప్రియాంక చోప్రా కాగా, మరొకరు పృథ్వీ రాజ్ సుకుమారన్. ఇప్పుడు ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ తో మరో సూపర్ స్టార్ చేతులు కలపబోతున్నాడు. అతను మరెవరో కాదు, కిచ్చా సుదీప్(Kiccha Sudeep). కన్నడ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న సుదీప్ తో రాజమౌళి ‘ఈగ’ సినిమా నుండి మంచి సాన్నిహిత్యం ఉంది.
‘ఈగ’ తర్వాత సుదీప్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ లో కూడా కీలక పాత్ర పోషించాడు. అతిథి పాత్రే అయినప్పటికీ, సినిమా పై మంచి ప్రభావమే చూపించింది. ఇప్పుడు సుదీప్ ‘వారణాసి’ లో ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడని, త్వరలోనే ఇండియా లో మొదలయ్యే షెడ్యూల్ లో ఆయన అడుగుపెట్టబోతున్నాడని, మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రం లో ఆయనకు ఉంటాయని తెలుస్తోంది. కథ ని కీలక మలుపు తిప్పుతూ, హీరో కి సపోర్టింగ్ గా ఉండే క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర నిడివి 30 నిమిషాల వరకు ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే సుదీప్ కి సంబంధించిన అప్డేట్ అధికారికంగా ప్రకటిస్తారట.