https://oktelugu.com/

Vanitha Vijay Kumar : వనిత విజయ్ కుమార్ మూడో భర్త మృతి… కాంట్రవర్సీ క్వీన్ ఏం చేసిందో తెలుసా!

నటులు విజయ్ కుమార్-మంజుల పెద్ద అమ్మాయి అయిన వనిత విజయ్ కుమార్ 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2007లో అతనితో విడిపోయారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 1, 2023 / 08:08 AM IST
    Follow us on

    Vanitha Vijay Kumar : నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త చనిపోయాడు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పీటర్ పాల్ కన్నుమూశారు. ఈ మేరకు సమాచారం అందుతుంది. వనిత విజయ్ కుమార్-పీటర్ పాల్ 2020లో వివాహం చేసుకున్నారు. హనీమూన్ కి కూడా వెళ్లొచ్చారు. వీరి రొమాంటిక్ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే పెళ్ళైన రోజుల వ్యవధిలో విభేదాలు తలెత్తాయి. తాగి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వనిత విజయ్ కుమార్ ఆరోపించారు. పీటర్ పాల్ ని కొట్టి ఇంటి నుండి గెంటేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. 
     
    ఈ క్రమంలో అదే ఏడాది వనిత విజయ్ కుమార్-పీటర్ పాల్ విడాకులు తీసుకున్నారు. వనిత విజయ్ కుమార్ తో విడిపోయిన మూడేళ్లకు పీటర్ పాల్ మరణించారు. మాజీ భర్త మృతిపై వనిత విజయ్ కుమార్ స్పందించారు. ఆమె ఒకింత ఎమోషనల్ అయ్యారు. పీటర్ మృతి బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి… అంటూ ఒక ఇంస్టాగ్రామ్ నోట్ షేర్ చేశారు. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్ అవుతుంది. 
     
    నటులు విజయ్ కుమార్-మంజుల పెద్ద అమ్మాయి అయిన వనిత విజయ్ కుమార్ 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2007లో అతనితో విడిపోయారు. అదే ఏడాది మరొక వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో అతనితో కూడా విడిపోయారు. మూడో వివాహంగా పీటర్ పాల్ ని చేసుకున్నారు. రోజుల వ్యవధిలో ఈ బంధం ముగిసింది. 
     
    వనిత జీవితంలో అన్నీ వివాదాలే. పిల్లలు, ఆస్తుల విషయంలో సొంత తండ్రితో ఆమె గొడవలు పడ్డారు. ఒకరోజు విజయ్ కుమార్ ఆవేశంతో పబ్లిక్ లో వనిత విజయ్ కుమార్ మీద దాడి చేశారు. బిగ్ బాస్ హౌస్లోకి ఆమె కోసం పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి వివాదాలు ఆమె జీవితంలో చాలా ఉన్నాయి. త్వరలో ఆమె మళ్ళీ పెళ్ళి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. నరేష్-పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి మూవీ త్వరలో విడుదల కానుంది. ఆమె కీలక రోల్ చేశారు.