Maharshi Movie: 67 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న వైభవంగా జరిగింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ అవార్డుల ప్రదానంలో ఆలస్యం జరిగింది. కాగా ఈ ఏడాది మార్చి లో ఈ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మన దేశ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మహర్షి. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించారు.

మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే ఈ సినిమాలో నటించారు. ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం గా జాతీయ అవార్డ్ అందుకోవడం పట్ల… మహర్షి టీమ్ కు అభిమానులు , సినీ తారలు శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ అవార్డ్ అందుకోవడం గర్వంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తపరిచారు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని… ఈ గౌరవం మొత్తం మహర్షి టీమ్ కి చెందింది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ సార్, ఈ సినిమా పై మీకున్న నమ్మకం కోసం అంటూ వంశీ ట్వీట్ చేశారు. మహర్షి చిత్రం అవార్డ్ అందుకోవడం పట్ల సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.