https://oktelugu.com/

వకీల్ సాబ్ స్టామినా ఈరోజు తెలుస్తుంది

వకీల్ సాబ్ ఊపు కొంచెం ఈరోజు తగ్గింది. రిలీజ్ అయిన శుక్రవారం అంతటా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ తెచ్చుకొని రికార్డు కలెక్షన్లు ఈ సినిమా సాధించింది. రివ్యూలు కూడా 3/5 లాగా అన్నీ ఇవ్వడంతో ఇక ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఆదివారం దాకా అసలు టికెట్లు దొరకలేదు. అయితే తాజాగా ఈరోజు సోమవారం ఎవరి పనుల్లో వారు బిజీ కావడంతో వకీల్ సాబ్ థియేటర్లకు జనాల సంఖ్య తగ్గిందట.. వకీల్ సాబ్ హిట్టా? […]

Written By:
  • NARESH
  • , Updated On : April 12, 2021 / 02:00 PM IST
    Follow us on

    వకీల్ సాబ్ ఊపు కొంచెం ఈరోజు తగ్గింది. రిలీజ్ అయిన శుక్రవారం అంతటా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ తెచ్చుకొని రికార్డు కలెక్షన్లు ఈ సినిమా సాధించింది. రివ్యూలు కూడా 3/5 లాగా అన్నీ ఇవ్వడంతో ఇక ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఆదివారం దాకా అసలు టికెట్లు దొరకలేదు.

    అయితే తాజాగా ఈరోజు సోమవారం ఎవరి పనుల్లో వారు బిజీ కావడంతో వకీల్ సాబ్ థియేటర్లకు జనాల సంఖ్య తగ్గిందట.. వకీల్ సాబ్ హిట్టా? మంచి కలెక్షన్లు సాధిస్తుందా? కొనసాగిస్తుందా? అని తెలియడానికి ఈ రోజు కీలకం. అందరూ బిజీగా ఉండే మండే నాడు కూడా థియేటర్లు అన్నీ ఫుల్ అయితే ఈ సినిమా హిట్ అయినట్టు. కాసిన్ని కాసులు అయినట్టు. మూడు రోజుల కలెక్షన్లతోనే సినిమా ఆడినట్టు.. లాభాలు వచ్చినట్టు కాదు.

    తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ 78 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. సోమవారం మంచి వసూళ్లు వస్తేనే ఈ 78 కోట్లకు బ్రేక్ ఈవెన్ ను వకీల్ సాబ్ సాధిస్తుంది. ఈరోజు నుంచి వచ్చే శుక్రవారం లోపు వకీల్ సాబ్ ను చూడడానికి వస్తేనే సినిమా గట్టెక్కుతుంది. లేదంటే మునగడం ఖాయం.

    వేరే పెద్ద సినిమాలు లేకపోవడం ఈ సినిమాకు కలిసి వస్తున్నా.. 100శాతం సీటింగ్ అక్యూపెన్సీ నిండితేనే వకీల్ సాబ్ లాభాల్లోకి వస్తుంది. ఈ వారం ఆడితేనే వకీల్ సాబ్ హిట్ అయినట్టు.. లాభాలు వచ్చినట్టు లెక్క.

    ఓ వైపు కరోనా భయంతో జనాలు థియేటర్ కు రావడానికి భయపడుతున్నారు. సో వీకెండ్ కు సెలవుల వల్ల వచ్చిన జనాలు ఈ వారాంతం కూడా వస్తేనే వకీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ కు చేరువ అవుతుంది. ఇప్పటికే 3 రోజుల్లో వకీల్ సాబ్ 60శాతం బ్రేక్ ఈవెన్ సాధించిందట.. ఇంకో 40 శాతం ఈ వారాంతానికి వస్తాయా? రావా? అన్నది ఈరోజు సినిమాకు వచ్చిన ఆదరణ బట్టి తెలుస్తుంది.