
కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది సినీరంగం కుదేలైపోయింది. గత ఆరునెలలుగా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభం అవుతున్నాయి. కొంతమందికే అవకాశాలు దక్కుతుండటంతో నటీనటులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా అక్టోబర్ నుంచి థియేటర్లు తెరుచుకోనుండటంతో సినీ పరిశ్రమకు కొంత ఊరట లభించనుందనే టాక్ విన్పిస్తోంది.
Also Read: చిరంజీవి అనుచరుడు.. బన్నీనా ? విజయ్ నా ?
వచ్చే నెల నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశాలు మొండుగా ఉన్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేలా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అయితే థియేటర్లు తెరుచుకున్న మునుపటిలా ప్రేక్షకులు సినిమాలు చేసే అవకాశం లేదని టాక్ విన్పిస్తోంది. రానున్న రోజుల్లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో థియేటర్లు మళ్లీ పుంజుకుంటాయని ఆశాభావాన్ని సినీప్రియులు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ నాటికి పరిస్థితులు చక్కబడుతాయని అంచనా వేస్తున్నారు.
వచ్చే సంక్రాంతి నాటికి థియేటర్లు అన్ని మునుపటిలా ప్రేక్షకులతో కళకళలాడుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో సంక్రాంతి రేసులో తమ సినిమాలు ఉండేలా అగ్ర నిర్మాతలు సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే సంక్రాంతికి రీలీజ్ డేట్స్ అనౌన్స్ సినిమాలన్నీ కూడా కరోనాతో వాయిదాపడే అవకాశం కన్పిస్తోంది. ‘ఆచార్య’.. ‘ఆర్ఆర్ఆర్’.. ‘రాధేశ్యామ్’ మూవీలు వచ్చే వేసవిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక సంక్రాంతి రేసులో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 80శాతం షూటింగును ‘వకీల్ సాబ్’ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో సినిమా షూటింగును మళ్లీ ప్రారంభించేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి పరిస్థితులను బట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
ఇక యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్-2’ కూడా సంక్రాంతి రేసులో ఉంది. ‘కేజీఎఫ్-1’ ఘనవిజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసే అవకాశం కన్పిస్తోంది.