‘వకీల్ సాబ్’గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డుల మోత మోగిస్తున్నారు. అద్దిరిపోయే కలెక్షన్లతో దుమ్ము లేపుతున్నారు. ఈ దెబ్బకు బాక్సాఫీస్ మోత మోగిపోతోంది. ఏపీ లాంటి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ.. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందీ చిత్రం. తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబట్టిన సినిమా.. వరుసగా నాలుగో రోజున కూడా అదే జోరు కొనసాగించింది.
ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ.72 కోట్ల గ్రాస్, 48.25 కోట్ల షేర్ ను రాబట్టి సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్, నైజా ఏరియాలో కలిపి 42.5 కోట్ల షేర్, మిగిలిన రాష్ట్రాల్లో 5.75 కోట్లు సాధించింది. దాదాపు 90 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగ్గా.. అందులో కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 55 శాతం మేర వెనక్కు తెచ్చిందని సమాచారం.
వకీల్ సాబ్ ప్రభంజనం ఓవర్సీస్ లోనూ కొనసాగుతోంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధిస్తోందని చెబుతున్నారు. మూడో రోజున 600కే అమెరికన్ డాలర్లు సాధించిందని సమాచారం. ఈ రేంజ్ రన్ తో త్వరలోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరబోతోంది.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం.. మూడో రోజైన ఆదివారం మరింతగా కలెక్షన్లు రాబట్టింది వకీల్ సాబ్. సండే ఒక్క రోజే.. రూ.25 నుంచి రూ.30 కోట్ల మేర కలెక్షన్లు సాధించినట్టుగా తెలుస్తోంది. దీంతో.. అతి త్వరలో రూ.100 కోట్ల క్లబ్ లో చేరబోతోందని తెలుస్తోంది.
నాలుగో రోజైన సోమవారం కూడా రికార్డు స్తాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని సమాచారం. తెలంగాణతోపాటు ఆంధ్రాలోనూ సినిమా కోసం ఆడియన్స్ ఎగబడుతున్నారు. సోమవారం హైదరాబాద్ లో 76 షోలు, వైజాగ్ లో 45 షోలు, విజయవాడలో 125 షోలు, నెల్లూరులో 24 షోలు ప్రదర్శించనున్నారు. దీంతో.. కలెక్షన్ల సునామీ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో వకీల్ సాబ్ సాధించిన కలెక్షన్ల అంచనా ఇలా ఉంది.
మొదటి రోజుః 40.10 కోట్లు
రెండో రోజుః 17.10 కోట్లు
మూడో రోజుః 14.42 కోట్లు
నాలుగో రోజుః 7.00 కోట్లు(అడ్వాన్స్ బుకింగ్స్)
మొత్తం రూ.78.62 కోట్లు