‘వి’ కుదిరిన ముహుర్తం.. ముందే దిగుతున్న నాని

హీరో నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ చిత్రం గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకొంది. ఉగాది కానుకగా ‘వి’ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో ‘వి’ మూవీ విడుదల వాయిదా పడిన సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీనీ ఓటీటీకి చెందిన అమెజాన్ ప్రైమ్ భారీ రేటు ఇచ్చి దక్కించుకుంది. ఈనెల 5న ఓటీటీలో ‘వి’ సినిమా చేసేందుకు ఓటీటీ నిర్వాహకులు […]

Written By: NARESH, Updated On : September 3, 2020 1:17 pm
Follow us on


హీరో నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ చిత్రం గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకొంది. ఉగాది కానుకగా ‘వి’ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో ‘వి’ మూవీ విడుదల వాయిదా పడిన సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీనీ ఓటీటీకి చెందిన అమెజాన్ ప్రైమ్ భారీ రేటు ఇచ్చి దక్కించుకుంది. ఈనెల 5న ఓటీటీలో ‘వి’ సినిమా చేసేందుకు ఓటీటీ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

‘వి’ చిత్రం నానికి 25వ చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన టీజర్, ఫస్టు లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓటీటీలో ఇప్పటివరకు టాలీవుడ్ కు చెందిన పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ‘వి’ సినిమానే టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న పెద్ద సినిమాగా రికార్డు సృష్టించబోతుంది. గత మూడునెలులుగా ఓటీటీలో సరైన తెలుగు సినిమా రిలీజు కాకపోవడంతో ‘వి’ మూవీ కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

తొలిసారి నాని, సుధీర్ బాబు ‘వి’ సినిమా కోసం కలిసి పని చేశారు. ఈ మూవీలో హీరోయిన్లుగా అదితి రావు హైదరి, నివేదా థామస్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు ‘వి’ని కోనుగోలు చేయడంతో ఈ మూవీ ఓటీటీలో రిలీజు కావడం ఖాయమని తేలింది. ఈనెల 5న ఓటీటీలో సినిమా రిలీజు కానుండటంతో నిర్వాహకులు ప్రమోషన్ పై దృష్టించారు.

ఇప్పటికే దర్శకుడు, ఒక హీరోతో ప్రమోషన్ చేపట్టిన అమెజాన్ ప్రైమ్ ఇక హీరో నానితో ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ముందస్తుగానే నాని సినిమా ప్రమోషన్లో పాలుపంచుకోబోతున్నాడు. ఇటీవల రిలీజైన్ ‘వి’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. భారీ రేటు ఇచ్చి సినిమాను దక్కించుకున్న ఓటీటీకి ‘వి’ మూవీ ఏమేరకు లాభాలు తెచ్చిపెడుతుందో వేచిచూడాల్సిందే..!