Pawan Kalyan new look:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 5 ఏళ్ళ క్రితం డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) పవన్ కళ్యాణ్ తో మొదలు పెట్టిన ఈ సినిమా, అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగించుకుంది ఈ నెల 24 న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ రెండవ సారి డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తో కలిసి పని చేస్తున్న చిత్రమిది. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
Also Read: హై కోర్టులో మెగాస్టార్ చిరంజీవి కి ఊరట..అసలు ఏమి జరిగిందంటే!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అభిమానులు కొంతమంది అత్యుత్సాహంతో దూరం నుండి ఒక షూటింగ్ సన్నివేశాన్ని తమ కెమెరాలతో రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీ షర్ట్ వేసుకొని, కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని, స్కూల్ వ్యాన్ కి స్టైల్ గా ఆనుకొని, ఎదురుగా ఉన్న శ్రీలీల తో పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ షాట్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతో సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా చూపించడం లో డైరెక్టర్ హరీష్ శంకర్ తర్వాతే ఎవరైనా అంటూ అభిమానులు సోషల్ మీడియా లో డైరెక్టర్ ని ట్యాగ్ చేసి ప్రశంసిస్తున్నారు.
Also Read: ఒకటి కాదు.. రెండు కాదు.. ‘50’ ఏళ్లు.. రజినీ మామూలోడు కాదు…
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు మూడు చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందించినా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పుతాడని అభిమానులు చాలా బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ఆగష్టు నెలాఖరున వరకు ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ ని కేటాయించాడు. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసి నవంబర్ లోపు సినిమాకు గుమ్మడి కాయ కొట్టేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి లేదా రిపబ్లిక్ డే నాడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.