Ustaad Bhagat Singh closing collections: కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లిపోయింది రీసెంట్ గా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh Movie) చిత్రం తో రుజువు అయ్యింది. మొదటి నుండి ఈ చిత్రం పై పవన్ అభిమానుల్లోనే పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉండడం , సెకండ్ హాఫ్ లో ఒక్క సన్నివేశం కూడా సినిమా కి ఫ్లో కి తగ్గట్టు లేకపోవడం తో ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫలితంగా 2017 వ సంవత్సరం లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రనికంటే తక్కువ వసూళ్లను నమోదు చేసుకొని , పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాయని మచ్చగా నిల్చింది ఈ చిత్రం. 5 నెలల క్రితమే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం తో ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మన అందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో భారీ విడుదల లేకపోయినప్పటికీ కూడా ఈ చిత్రానికి కూడా, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , ఇంతటి దారుణమైన పరాజయాన్ని ఎదురుకోవడం , పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా తీరని బాధ అనే చెప్పాలి. రేపు భవిష్యత్తులో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తగినప్పటికీ కూడా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని మర్చిపోలేరు అభిమానులు. ఇకపోతే థియేట్రికల్ రన్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి 18 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, సీడెడ్ నుండి 8 కోట్లు , తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 50 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్లు , నెల్లూరు జిల్లా నుండి కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 61.6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 108 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఓజీ మొదటి రోజు వసూళ్లకంటే చాలా తక్కువ అన్నమాట.