Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే..'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్..రేపే...

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే..’ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..రేపే అధికారిక ప్రకటన!

Ustaad Bhagat Singh: ‘ఓజీ’ లాంటి భారీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh Movie). షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. మళ్లీ ఆయన సినిమా చేస్తాడా లేదా అనే అనుమానం అభిమానుల్లో ఉన్నది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని ఫ్యాన్స్ చివరి చిత్రంగా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఏప్రిల్ 3వ వారం లో విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ లో రావడం లేదు , అంతకంటే ముందే విడుదల కాబోతుంది.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రేపే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. మార్చి 26 న ఈ చిత్రం విడుదల ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అంటే శ్రీ రామ నవమి రోజున విడుదల కాబోతుంది అన్నమాట. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే,ఉంది. ఆరోజు కూడా సెలవు దినం కావడం తో, ఆ వీకెండ్ భారీగా వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీ రామనవమి లాంటి పండగ దినం రోజున ఈ చిత్రం విడుదల కాబోతుంది కాబట్టి, బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఓపెనింగ్ ని చూడొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. రేపు ఎదో ఒక సమయం లో మంచి మాస్ పోస్టర్ ద్వారా కానీ, లేదా చిన్న టీజర్ బిట్ తో కానీ, ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించబోతున్నారట మేకర్స్.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ‘ఓజీ’ కి మించిన వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘ఓజీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 133 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సూపర్ హిట్ టాక్ వస్తే , మొదటి 10 రోజుల్లోనే ఈ వసూళ్లను దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే అభిమానులు మార్చి 26 కాంట్ , మార్చి 19 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే రంజాన్, ఉగాది లాంటి భారీ హాలిడేస్ ని ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version