Ustaad Bhagat Singh Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా సాగుతుంది. నిన్నటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్,రాశి ఖన్నా కాంబినేషన్ లో తెరకెక్కించిన పాటకు సంబంధించిన కలర్ గ్రేడింగ్ , DI మిక్సింగ్ చేశారు. రేపటి నుండి ఆర్టిస్టుల డబ్బింగ్ కూడా మొదలు కాబోతుంది అట. ఇక రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ తో ఒక పవర్ ఫుల్ సాంగ్ ని రాయించారు. ఫిబ్రవరి 2వ వారం లో ఈ పాట విడుదల కానుంది. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జెట్ స్పీడ్ లో జరుగుతోంది . ఇంత స్పీడ్ లో ఈ పనులు ముందుకు వెళ్ళడానికి కారణం ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అవ్వడం వల్లే.
మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి మార్చి 27 న రామ్ చరణ్ పెద్ది సినిమాని షెడ్యూల్ చేశారు. కానీ ఆ సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమాని మేడే సందర్భంగా మే 1న విడుదల చేయడానికి చూస్తున్నారట. ఈ రెండు చిత్రాలకు ఒకరే నిర్మాత కావడం తో, పెద్ది ని విడుదల చేయాల్సిన తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్. అయితే ఈ అంశం పై రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల సోషల్ మీడియా లో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి.
‘పెద్ది’ సినిమాని కావాలని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసమే వాయిదా వేస్తున్నారని, కవరింగ్ కోసం ఇలా షూటింగ్ బ్యాలన్స్ ఉండడం వల్ల వాయిదా వేస్తున్నామని అంటున్నారు అంటూ రామ్, చరణ్ అభిమానులు మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ, జనవరి నెలాఖరున పెద్ది షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అన్నారు, కానీ రామ్ చరణ్ రీసెంట్ గానే ఒక భారీ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. వచ్చే నెల చివరి వారం వరకు ఈ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది కాబట్టే విడుదల అవ్వడం లేదు, పవన్ కళ్యాణ్ వల్ల వాయిదా పడింది అని అనవసరమైన మాటలు మాట్లాడకండి అంటూ పవన్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు.