Ustaad Bhagat Singh Release Date: ‘ఓజీ’ సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఆ తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆయన నుండి కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ఆయన మొదలు పెట్టిన చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసిన రెండవ చిత్రమిది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల తేదీని గత నెలలోనే ఫిక్స్ చేశారు. నేడు కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. వచ్చే నెల 26 వ తేదీన ఈ చిత్రం విడుదల చేస్తున్నారట.
వింటేజ్ పవన్ కళ్యాణ్ యంగ్ లుక్స్ తో, మంచం మీద స్టెప్పులేస్తూ స్టైల్ గా నిల్చున్న ఫోజు అభిమానులను తెగ అలరించింది. పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ లుక్స్, వింటేజ్ ఎనర్జీ ని తీసుకొని రావాలంటే హరీష్ శంకర్ కి మాత్రమే సాధ్యం అంటూ అభిమానులు ఈ సందర్భంగా ఆయన్ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అట. తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం లోని ‘నా రెడీ’ సాంగ్ గుర్తుందా?, ఈ పాట కూడా ఆ స్టైల్ లో ఉంటుందట. త్వరలోనే ఈ పాటని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన మొదటి పాట ‘దేఖ్ లేంగే సాలా’ పాట కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది. ఈ పాటలో కూడా పవన్ కళ్యాణ్ అదే రేంజ్ లో డ్యాన్స్ వేసాడట. ఈ పాట తర్వాత మూవీ పై అంచనాలు భారీ గా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎంత యాటిట్యూడ్ తో చూపించారో, ఈ సినిమాలో అంతకు మించిన యాటిట్యూడ్ తో చూపించాడట డైరెక్టర్. విడుదల తేదీ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. మార్చి 26 విడుదల అయితే, 27న శ్రీ రామనవమి, ఆ తర్వాత వీకెండ్ కూడా మొదలు. పాజిటివ్ టాక్ ఒక్కటే బ్యాలన్స్ , వీకెండ్ లోపు 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా ఈ చిత్రానికి ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD
This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN #UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan… pic.twitter.com/XjcuIv64wh
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 4, 2026