spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Mallareddy Role Removed Reason: ఉస్తాద్ భగత్ సింగ్ లో మాజీ...

Ustaad Bhagat Singh Mallareddy Role Removed Reason: ఉస్తాద్ భగత్ సింగ్ లో మాజీ మంత్రి మల్లా రెడ్డి పాత్రను తీసేసారా..? కారణమేంటంటే..?

Ustaad Bhagat Singh Mallareddy Role Removed Reason: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడున్న స్టార్ హీరోలందరి కంటే మొదట టైర్ వన్ హీరోగా మారిన నటుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో కూర్చోబెట్టాయి. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ డిఫరెంట్ విలన్ పాత్ర కోసం మాజీ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించారట… కానీ మల్లారెడ్డి మాత్రం ఆ పాత్రను నేను చేయనని చెప్పారట.

Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఈ విషయాన్ని మల్లారెడ్డి ఓపెన్ గా పలు సందర్భాల్లో చెప్పాడు. కారణం ఏంటి అంటే విలన్ ఎవరైనా సరే చివర్లో హీరో చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పాత్ర నేను చేయనని చెప్పారట. నిజానికి మల్లారెడ్డి కనక ఒప్పుకున్నట్లయితే ఈ సినిమాలో ఒక కామెడీ విలన్ పాత్రను ఆయనతో చేయించేవారట.

అయితే ఆయన చేస్తే ఆ పాత్రకి చాలా మంచి గుర్తింపు వస్తుందని హరీష్ శంకర్ భావించారట. నిజానికి ఆ పాత్ర తను చేయనని చెప్పడంతో సినిమానుంచే ఆయన క్యారెక్టర్ మొత్తం తీసేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఏమైనా కూడా మంత్రి మల్లారెడ్డి స్పీచ్ ఇచ్చాడు అంటే అదొక పెను ప్రభంజనంగా మారుతుంది. తన మాటలు వినడానికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు… ప్రతి ఒక్కరి గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు.

రాజకీయ రంగంలోనే కాకుండా ఆయన చాలామంది స్టూడెంట్స్ కి కూడా తమ జీవిత చరిత్ర ను చెబుతూ తన లానే వాళ్లు కూడా పైకి రావాలని చెబుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి అటు విద్యాసంస్థలను చూసుకుంటూనే ఇటు పాలిటిక్స్ లో రాణిస్తున్నాడు. విలన్ పాత్రలు కాకుండా ఏదైనా డిఫరెంట్ పాత్ర దొరికితే నటిస్తానని ఆయన పలు సందర్భాల్లో చెబుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version