Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Sing Vs Peddi: 'ఉస్తాద్ భగత్ సింగ్' కి 140 కోట్లు..'పెద్ది'...

Ustaad Bhagat Sing Vs Peddi: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 140 కోట్లు..’పెద్ది’ కి 170 కోట్లు..బయ్యర్స్ కి చుక్కలు చూపిస్తున్న మేకర్స్!

Ustaad Bhagat Sing Vs Peddi: మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ తర్వాత అతి పెద్ద సీజన్ ఏదైనా ఉందా అంటే, అది సమ్మర్ సీజన్ మాత్రమే. సరైన సినిమా పడితే చాలు నెలల తరబడి థియేటర్స్ లో ఆడేస్తుంటాయి. ఈ సమ్మర్ కి కూడా ప్రేక్షకులను అలరించడానికి అనేక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ‘ధురంధర్ 2’, ‘టాక్సిక్’ వంటి భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం కూడా వచ్చే నెలలో సందడి చేయబోతున్నాయి. ఇక ఆ తర్వాత ఏప్రిల్ నెలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) పెద్ది(Peddi Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘పెద్ది’ చిత్రాలకు ఒకడే నిర్మాత. రెండు సినిమాలకు సంబంధించిన బిజినెస్ ని రీసెంట్ గానే మొదలు పెట్టారు నిర్మాతలు.

మార్చి 26 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 140 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాతలు 160 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేశారని, కానీ బయ్యర్స్ కేవలం 140 కోట్లకు పరిమితం చేసారని టాక్. ఇదేమి చిన్న అమౌంట్ కాదు. ఒక మామూలు కమర్షియల్ సినిమాకు ఈ రేంజ్ రేట్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ అభిరుచి కి పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ, దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాంటిది మన ఆడియన్స్ కి బాగా అర్ధమయ్యే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి కమర్షియల్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ మేరకు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ‘పెద్ది’ చిత్రానికి అయితే బయ్యర్స్ నుండి కళ్ళు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయింది. ఒక నార్త్ అమెరికా లోనే ఈ చిత్రం 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ డిమాండ్ ఉంది అనేది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రానికి 170 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ ఊపు ని చూస్తుంటే హిందీ వెర్షన్ తో కలిపి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version