Ustaad Bhagat Singh : ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ అప్పటినుంచి ఇప్పటివరకు మంచి సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి తన అభిమానులు నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా సుజీత్ దర్శకత్వంలో చేసిన ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు…ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం 2026వ సంవత్సరంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే మనకు ‘గబ్బర్ సింగ్’ సినిమా గుర్తుకొస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పూర్తి ఎనర్జిటిక్ యాక్టింగ్ ని చూపించాడు. అలాగే హరీష్ శంకర్ సైతం పవన్ కళ్యాణ్ లో ఉన్న హ్యూమర్ ని బయటకు తీసి ప్రేక్షకులందరి చేత నవ్వులు పూయించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గబ్బర్ సింగ్ సినిమా పేరు చెప్తే అందరికీ అంత్యాక్షరి గుర్తుకొస్తుంది.
ఆ సినిమాలో ఉన్న రౌడీ గ్యాంగ్ తో పవన్ కళ్యాణ్ అంత్యాక్షరి ఆడించిన సీన్ ఇప్పటికి సుపరిచితమే…అలాంటి ఒక సీన్ ని మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రీ క్రియేట్ చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా టాప్ పొజిషన్ కి వెళ్లిపోతారు. ప్రస్తుతం హరీష్ శంకర్ కొంతవరకు ఇబ్బందుల్లో ఉన్నాడు.
ఈయన గత సంవత్సరం చేసిన ‘మిస్టర్ బచ్చన్ ‘ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు వెనకడుగు వేస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి తను పూర్వ వైభవాన్ని సంతరించుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…