Homeఎంటర్టైన్మెంట్Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ప్లాప్...కానీ దురంధర్ 2 కథ నాదే : హరీష్...

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ ప్లాప్…కానీ దురంధర్ 2 కథ నాదే : హరీష్ శంకర్…

Harish Shankar: కమర్షియల్ సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ గా నిలపడమనేది అంత ఆశా మాషీ వ్యవహారమైతే కాదు. ఎందుకంటే ఒక సంవత్సరంలో 200 సినిమాలు రిలీజైతే ఇందులో దాదాపు 150 సినిమాలు కమర్షియల్ సినిమాలే ఉంటాయి. కాబట్టి వాటిని కాదని డిఫరెంట్ వేలో సినిమాలను ప్రజెంట్ చేస్తూ స్టార్ హీరోల ఇమేజ్ దెబ్బతినకుండా సినిమాలను చేయడం అనేది చాలా పెద్ద టాస్క్… ఇక అలాంటి కొన్ని అగ్ని పరీక్షలను సైతం అలవోక గా దాటేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు కొంత మంది ఉన్నారు. వాళ్ళలో హరీష్ శంకర్ ఒకరు. అయితే ఆయన కెరీర్ మొదట్లో చేసిన కమర్షియల్ సినిమాలన్నీ మంచి విజయాలను సాధించినప్పటికి రీసెంట్ గా చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

ఈ సినిమా ఫ్లాప్ వల్ల ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అందరికి నచ్చకపోవచ్చు. కానీ దురంధర్ సినిమాలో నేను ఏదైతే భావాన్ని చెప్పాలనుకున్నానో దర్శకుడు ఆ అదే పాయింట్ ను చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు.

అందువల్ల ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. మొత్తానికైతే ఆ కామెంట్స్ ని చూసిన చాలా మంది సినిమా అభిమానులు హరీష్ శంకర్ మీద ఫైర్ అవుతున్నారు. నువ్వు చెప్పిన కథతో ఆయన సినిమా చేయడం ఏంటి? ఆయన కథ ఏంటి నీ కథ ఏంటి అంటూ ఆయన మీద విరుచుకుపడుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన హరీష్ శంకర్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానుల కోరికను నెరవేర్చలేకపోయాడు… దానికి తగ్గట్టుగానే ఇప్పుడు హరీష్ శంకర్ కి అవకాశం ఇచ్చే హీరోలు కూడా కరువైపోయారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version