All We Imagine As Light : కంటెంట్ బేస్డ్, ఆర్ట్ మూవీస్ కి థియేటర్స్ లో ఆదరణ దక్కకపోవచ్చు. కానీ ఓటీటీ ప్రియులు వీటిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న ఓ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. అది ఇద్దరు కేరళ నర్సుల కథ. సదరు మూవీ టైటిల్… ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’. ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ ఫీచర్ ఫిల్మ్ ఇండియాలో సెప్టెంబర్ 21న విడుదల చేశారు. అక్టోబర్ 2న ఫ్రాన్స్ లో విడుదల చేశారు. థియేట్రికల్ విడుదలకు ముందు కేన్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
కానీ కస్తూరి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు చేశారు. ఛాయా కదం, హ్రిదు హరూన్ ఇతర కీలక రోల్స్ చేశారు. థమన్ హకీమ్, జూలియన గ్రఫ్ నిర్మాతలుగా ఉన్నారు. కేస్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ దక్కింది. మూవీ ముగిశాక ప్రేక్షకులు 8 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. స్వాహం అనంతరం కేన్స్ మెయిన్ కాంపిటీషన్ కంప్లీట్ చేసిన ఇండియన్ మూవీగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంతగానో కొనియాడారు. కాగా ఈ చిత్రం జనవరి 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కథ విషయానికి వస్తే… పార్వతి(కానీ కస్తూరి), అను(దివ్య పభ) కేరళకు చెందిన నర్సులు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో జాబ్ చేస్తుంటారు. పార్వతి భర్త పెళ్లి అనంతరం జర్మనీ వెళ్ళిపోతాడు. అతడి రాక కోసం పార్వతి ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. ముక్కుసూటిగా ఉండే పార్వతిని ఆ ఆసుపత్రిలోని ఓ డాక్టర్ ఇష్టపడతాడు. కానీ అతడి ప్రపోజల్ ని పార్వతి తిరస్కరిస్తుంది.
నాకు పెళ్లైంది. ఎలాంటి రిలేషన్స్ అవసరం లేదని అంటుంది. మరోవైపు అను ఒక ముస్లిం యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. అతడిలో ప్రేమలో పడుతుంది. పార్వతి, అనుల జీవితాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి. వారికి ఎదురైన సమస్య ఏంటి? చివరికి పార్వతి, అనుల కథ ఎలా ముగిసింది అనేది కథ. ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం ఖచ్చితంగా మెప్పిస్తుంది.