Urvashivo Rakshasivo Movie Collections : అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైనా సంగతి మన అందరికి తెలిసిందే..ఆసక్తికరమైన ట్రైలర్ తో విడుదలకి ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించిన ఈ సినిమాకి విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ ఈ సినిమాకి టాక్ కి తగ్గట్టుగా వసూళ్లు మాత్రం రావడం లేదు..ప్రతి సినిమాకి ఎంతో కీలకంగా మారే వీకెండ్ ఓపెనింగ్స్ ని కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది..ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..గీత ఆర్ట్స్ బ్రాండ్ ఇమేజి మరియు అను ఇమ్మానుయేల్ వంటి క్రేజీ హీరోయిన్ ఇందులో నటించడం తో ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కానీ అల్లు శిరీష్ కి మార్కెట్ పూర్తిగా దెబ్బతినడం తో వసూళ్లు రావడం లేదు..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా వీక్ డేస్ లో కలెక్షన్స్ హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది..కానీ వీకెండ్ లోనే వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ సినిమా వీక్ డేస్ లో నిలవడం దాదాపుగా అసాధ్యమే అని ట్రేడ్ పండితుల అంచనా.
ఇక మూడు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో..బ్రేక్ ఈవెన్ మార్కుకి ఇంకా ఎంత వసూళ్లు రాబట్టలో ఒకసారి విశ్లేషిద్దాం..మొదటి రోజు ఈ సినిమాకి కోటి రూపాయిల షేర్ వస్తుందని అంచనా వేశారు..కానీ కేవలం 50 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది..టాక్ వచ్చింది కదా రెండవ రోజు షేర్ మొదటి రోజు కంటే భారీ గా ఉంటుందిలే అనుకున్నారు ట్రేడ్ పండితులు.
కానీ రెండవ రోజు 55 లక్షల రూపాయిల షేర్ ని సాధించి మొదటి రోజు మీద కేవలం 5 లక్షల రూపాయిల గ్రోత్ ని మాత్రమే చూపించింది..ఇక మూడవ రోజు పరిస్థితి కూడా ఇంతే..అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు కోటి 50 లక్షల షేర్ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపితే కోటి 75 లక్షల రూపాయిల షేర్ వచ్చింది..ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించాలి..అంటే లాంగ్ రన్ కచ్చితంగా ఉండాల్సిందే..అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పొచ్చు..చూడాలిమరి అల్లు బాబు ఫుల్ రన్ లో ఎంతవరుకు నెట్టుకొస్తాడు అనేది.