Balakrishna: హీరో బాలకృష్ణ వరుస విజయాలతో జోరు మీదున్నారు. దశాబ్దాల అనంతరం బాలయ్యకు హ్యాట్రిక్ పడింది. ఫుల్ ఫార్మ్ లో ఉన్నప్పుడు కూడా బాలయ్య వరుస హిట్స్ కొట్టిన దాఖలాలు లేవు. ఆయన అఖండ మూవీతో ఫార్మ్ లోకి వచ్చాడు. దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానుల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడు. ఆ వెంటనే వీర సింహారెడ్డి చిత్రంతో మరో విజయం అందుకున్నాడు. లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయం సాధించాయి.
ప్రస్తుతం NBK 109 చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్స్, వాటి మీదున్న కొటేషన్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. బాలకృష్ణను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది వాస్తవం. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా NBK 109లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలా నటిస్తుంది. ఇప్పటికే ఊర్వశి రాతెలా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఆమె బాలయ్య మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఊర్వశి రాతెలా బర్త్ డేను ఘనంగా జరిపారు. సెట్స్ లో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. NBK 109 సెట్స్ లో ఊర్వశి రాతెలా బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దీంతో బాలకృష్ణతో పాటు దర్శకుడు బాబీ, చిత్ర యూనిట్ కి ఊర్వశి రాతెలా కృతఙ్ఞతలు తెలియజేసింది. NBK 109 సెట్స్ లో తన బర్త్ డే వేడుకలు జరపడం గొప్ప అనుభూతిని పంచిందని రాసుకొచ్చింది. ఇక ఊర్వశి రాతెలా పాత్ర ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో సైతం ఐటెం సాంగ్ చేయడం విశేషం.
THANKS A MILLION MY #NBK109 FILM FAMILY. “Expressing heartfelt gratitude. Your blessings during my birthday celebration means the world to me. Thanks a million for making it so special.” @dirbobby @SitharaEnts @vamsi84 @NBKTrends @NBK_Unofficial @thedeol @dulQuer #love #UR7… pic.twitter.com/JZElLpr0BW
— URVASHI RAUTELA (@UrvashiRautela) February 17, 2024
Web Title: Urvashi rautela grand birthday celabrations on nbk 109 set
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com