Sankranti Movies : సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినీ రంగం కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా అగ్ర హీరోలు నటించిన మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. సినీ పరిశ్రమకు జనవరి నెల ఒక వరం లాంటిది. ప్రతేడాది ఈ పండుగకు తమ సినిమాలు రిలీజ్ కావాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటారు.కనీసం వారి సినిమాలకు సంబంధించిన అప్ డేట్ అయినా ఉండాలని భావిస్తుంటారు.
అలాగే సంక్రాంతి వచ్చిందంటే సినీ ప్రియులు.. అభిమాన నటీనటుల సినిమా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో, ప్రముఖుల శుభాకాంక్షలతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది. ఇప్పటికే అగ్ర హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయగా.. మరికొన్ని పోస్టర్లు అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. ప్రభాస్ రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ వచ్చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
అలాగే శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ‘సింహ, లెజెండ్, అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి చేయనున్న పినిమా ‘అఖండ 2’. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి ఇది సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇంట్రో వీడియో, పోస్టర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ సంక్రాంతి కానుకగా వచ్చేసింది. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ‘మహాకుంభమేళా’లో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది.
అలాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ కూడా మేకర్స్ రీవీల్ చేశారు. కన్నడ స్టార్ పృథ్వీ అంబర్ నటిస్తున్న చౌకీ దార్ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. అలాగే గాంధీ తాత చెట్టు, బాపు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి.మంచు విష్ణు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన బైరవం, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప, విశ్వక్ సేక్ లైలా సినిమా యూనిట్లు కూడా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లను రిలీజ్ చేశాయి.
అటు మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘ముంగిళ్లలో అందమైన రంగవల్లులు, లోగిళ్లలో ఆనందపు వెలుగులు, జంగమ దేవరుల జే గంటలు, హరిదాసుల కీర్తనలు, భోగభాగ్యాలు, సిరిసంపదలూ.. అందరి జీవితాల్లో ఈ పండుగ తెచ్చే నూతన వైభవం వెల్లివిరియాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ – చిరంజీవి