https://oktelugu.com/

Update From Prabhas’s Adipurush: బాహుబలి ప్రభాస్ ఆదిపురుష్ మూవీ నుండి కొత్త అప్డేట్

Update From Prabhas’s Adipurush:  వరుస సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ని చిత్ర టీం ప్రకటించింది. కరోనా పరిస్థితులను సైతం లెక్క చేయకుండా దర్శకుడు షూటింగ్ ని […]

Written By: , Updated On : October 9, 2021 / 12:51 PM IST
Update From Prabhas's Adipurush
Follow us on

Update From Prabhas’s Adipurush:  వరుస సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణాసుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌’. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ని చిత్ర టీం ప్రకటించింది. కరోనా పరిస్థితులను సైతం లెక్క చేయకుండా దర్శకుడు షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కెమెరా పనితనం కంటే టెక్నీషియన్స్ పడుతున్న కష్టమే ఎక్కువ.

 

ఆదిపురుష్ సినిమాకి సంబంధించి ఈరోజు దర్శకుడు ఓం రావత్ ట్వీటర్ వేదికగా ఒక ఫోటోను పంచుకున్నాడు. నెగిటివ్ రోల్ లంకేశ్ పాత్రధారి సైఫ్ అలీఖాన్ పోర్షన్ ను పూర్తి చేసి, అతనికి వీడ్కోలు చెప్పారు టీం సభ్యులు. ఇదే విషయాన్ని నిన్నఈ మూవీ కస్ట్యూమ్ డిజైనర్ నచికేత్ బార్వే తెలిపారు. షూటింగ్ సమయంలో సైఫ్ ఎంతో సహకరించారని, ఆయనతో పని చేయడం చాల ఆనందాన్ని కలిగించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇక సైఫ్‌ అలీఖాన్ కు వీడ్కోలు పలుకుతూ, సెట్ లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్ చేశారు. సైఫ్ తో పనిచేయడం సంతృప్తిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఓం రావత్, సైఫ్ కాంబోలో వచ్చిన ‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ‘ఆదిపురుష్’ కోసం పనిచేశారు.

 

ఈ సినిమా కోసం బాహుబలి ప్రభాస్ అభిమానులతో పాటు , తాను కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని సైఫ్ సైతం అన్నాడు. సైఫ్ అలీఖాన్ కూడా తెలిపారు. సినిమాలో తన భాగం షూటింగ్ త్వరగా అయిపోయింది, అందరు బాగా సహరించారని, తన పాత్ర కోసం ఒకరు దుస్తులు వేస్తుండగా మరొకరు అదేసమయంలో మేకప్ చేస్తుంటారు. ఆ సమయంలో నా శరీరానికి వారికి ఇచ్చేశానని వారికి నచ్చినట్టు అలంకరణ చేశాక కెమెరా ముందు నిలబెట్టేవారని సరదాగా చెప్పుకొచ్చాడు సైఫ్. మరి మిగిలిన నటీనటుల షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఏడాదిలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న పలు చిత్రాలు విడుదలవనున్న నేపథ్యంలో అభిమానులకు పండగే అని చెప్పాలి.