Anganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’గా రాబోతున్న నవీన్..!

Anganaga Oka Raju: ‘జాతిరత్నం’ మూవీతో సాలీడ్ హిట్టుకొట్టిన నవీన్ పోలిశెట్టి త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ కూడా ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ జోనర్లో తెరకెక్కినట్లు టాక్ విన్పిస్తోంది. ఇక ఈ మూవీతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ‘అనగనగా ఒక రాజు’ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు కల్యాణ్ శంకర్ సంక్రాంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశాడు. రెండు నిమిషాల 11సెకన్ల […]

Written By: Raghava Rao Gara, Updated On : January 17, 2022 10:29 am
Follow us on

Anganaga Oka Raju: ‘జాతిరత్నం’ మూవీతో సాలీడ్ హిట్టుకొట్టిన నవీన్ పోలిశెట్టి త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ కూడా ‘జాతిరత్నాలు’ తరహాలోనే కామెడీ జోనర్లో తెరకెక్కినట్లు టాక్ విన్పిస్తోంది. ఇక ఈ మూవీతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.

‘అనగనగా ఒక రాజు’ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు కల్యాణ్ శంకర్ సంక్రాంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చేశాడు. రెండు నిమిషాల 11సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు(నవీన్ పొలిశెట్టి) ఇంట్రడక్షన్ ను మూవీ మేకర్స్ బీభత్సంగా చూపించారు.

రాజుగాడి పెళ్లంటూ నవీన్ పోలిశెట్టి బిల్డప్ బాబాయ్ ఓ రేంజులా మాట్లాడటం నవ్వులు పూయించింది. పెళ్లి కొడుకు గెటప్ లో నవీన్ తన పెళ్లి గురించి.. తన వెనుక ఉన్న డబ్బు గురించి బిల్డప్ లు ఇవ్వడమే టీజర్ మొత్తం కన్పించింది. ఈ టీజర్ చివరి వరకు పరిశీలిస్తే  ‘అనగనగా ఒక రాజు’ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

టీజర్లో నవీన్ పోలిశెట్టి నటన అద్భుతంగా ఉంది. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ టీజర్ మొత్తంలో నవీన్ పొలిశెట్టి బిల్డప్ మాత్రమే ఉండటంతో హీరోయిన్ ఎవరా? అనే సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోయిన్ పేరును త్వరలోనే ఖరారు చేసే అవకాశం కన్పిస్తోంది.

ఈ మూవీని ‘సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 15గా తీసుకు రాబోతున్నారు. సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్యలు ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  మ్యూజికల్ సన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.