మెగాస్టార్ ట్వీటర్ అకౌంట్ ఓపెన్ చేయగానే లక్షల్లో అభిమానులు ఆయన ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారు. దీంతో జెట్ స్పీడుతో ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. మెగాస్టార్ తొలి ట్వీట్ చేయగా అభిమానులు వెల్ కమ్ టూ ట్వీటర్ అంటూ స్వాగతం పలికారు. అదేవిధంగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెగా కోడలు కోడలు ఉపాసన ‘వెల్కమ్ టు ట్విట్టర్ మామయ్య’ అనే ట్వీట్ తో స్వాగతం పలికింది. అభిమానులతోపాటు ఆమె కూడా మెగాస్టార్ కు ట్వీటర్లో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాసన రాంచరణ్ సినిమా కార్యక్రమాలను చూసుకోవడంతోపాటు సేవా కార్యక్రమాలతో బీజీగా ఉంటారు. అదేవిధంగా అపోలోకు సంబంధించిన బిజినెస్ చూసుకుంటుంటారు. ఇటీవల ఓ యూబ్యూబ్ ఛానల్ ప్రారంభించి హెల్త్ కు సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఉపాసనకు కూడా సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం సినిమాల్లో, రాజకీయాల్లో మాత్రమే చూసే అభిమానులకు చిరంజీవితో నేరుగా తమ భావాలను పంచుకునేందుకు వేదిక దొరకడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.