
కరోనా లాక్ డౌన్ తో ఎంటర్ టైన్ మెంట్ కు తెరపడిపోయింది. అందరిలోనూ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. బయటకు వెళితే కరోనా భయం కావడంతో అందరూ మిన్నకుండిపోతున్నారు. కరోనా సంక్షోభంతో నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఉపాసన, రాంచరణ్ నడుం బిగించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి ఆన్ లైన్ డ్యాన్స్ షోను ఆరంభించబోతున్నారు.
Also Read: జోష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గరమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
దివ్యాంగులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఉపాసన రాంచరణ్ నిర్ణయించారు. దివ్యాంగులు ఎలా విజయం సాధించారో చూపించబోతున్నారు. తపస్ అనే కుర్రాడు పుట్టుకతో ఎలా అనారోగ్యం బారినపడి ఎదిగాడో ఉపాసన వివరించింది.
ఇక ఈ షోలో రాంచరణ్ తోపాటు ప్రభుదేవా, ఫరాఖాన్ కూడా ఈ షోలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ ఎమోషనల్ అయ్యారు.
రాంచరణ్ మాట్లాడుతూ ‘నా హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్స్. చిన్నప్పటి నుంచి మ్యూజిక్.. డ్యాన్స్ అంటే పిచ్చి.. దివ్యాంగుల కోసం డ్యాన్స్ టాలెంట్ షో చేయడం ఆనందంగా ఉంది.. దివ్యాంగులు ఈ షోలో పాల్గొనాలి. ఇందుకోసం urlife.co.inలో దివ్యాంగులు పేర్లు నమోదు చేసుకోండి. ’ అంటూ రాంచరణ్ పిలుపునిచ్చారు.
Also Read: ప్రభాస్ కి కిల్లర్ ఫీస్ట్.. ఏమిటి నాగ్ అశ్విన్ ?
కరోనా వేళ దివ్యాంగుల డ్యాన్స్ వీడియోలు చూసి స్ఫూర్తి పొందాను. వారి నుంచే సవాళ్లను ఎలా అధిగమించాలనేది చూసి నేర్చుకున్నానని రాంచరణ్ తెలిపారు.