
నేషనల్ స్టార్ గా మారిపోయాక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే వాటిలో ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. అందుకే నాగ్ అశ్విన్ కు ఫ్యాన్స్ సినిమాకి సంబంధించి నిత్యం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ అడిగిన వాటికి నాగఅశ్విన్ కూడా రెస్పాండ్ అయ్యి మొత్తానికి ప్రభాస్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ను అలాగే మరో బ్యాడ్ న్యూస్ ను కూడా రివీల్ చేశాడు. ఇంతకీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ప్రభాస్ పుట్టినరోజుకు తమ సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రీట్ ఉండదని.. ఎందుకంటే తాము ఇంకా షూట్ ను ప్రారంభించలేదని ఆ కారణంగానే ఎలాంటి ఫస్ట్ లుక్ వీడియో కూడా రిలీజ్ అవ్వదు అని నాగ్ అశ్విన్ స్పష్టం చేశాడు.
Also Read: పోస్ట్ ప్రొడక్షన్ లో చైతు ‘లవ్ స్టోరీ’
ఇక ప్రభాస్ కి సంబంధించి గుడ్ న్యూస్ ఏమిటంటే ఒక కిల్లర్ అప్ డేట్ మాత్రం ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందుగానే రెడీగా ఉందట. ఇంతకీ ఆ కిల్లర్ అప్ డేట్ ఏమిటో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందని.. ఆ దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ఓ పురాణ కథ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు అని, కథలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. అన్ని భాషల వారికి నచ్చే అంశాల ఆధారంగా ఈ సినిమాని తీయాలని నాగ్ అశ్విన్ అందుకు తగ్గట్లుగానే స్క్రిప్ట్ ను ఇప్పటికే పూర్తి చేశాడట.
Also Read: త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్
ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడని.. డిసెంబర్ నాటికి ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అవుతాయని తెలుస్తోంది. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేదు. భారీ సీన్స్ తీసే క్రమంలో వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కావాలి కాబట్టి, వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఈ సినిమా షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని మేకర్స్.. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంటుంది. ఇక ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు.
Birthday something simple only…ee corona valla mana shoot start ke inka chaala time undi…so can't reveal much now…but one killer update ull get before bday only..v v soon…. 🙂
— Nag Ashwin (@nagashwin7) October 7, 2020
Comments are closed.