https://oktelugu.com/

Upasana: ఉపాసన, క్లింకార కు రాష్ట్రపతి ఆశీస్సులు.. మాకెప్పుడు చూపిస్తారంటున్న అభిమానులు

హైదరాబాద్ మహానగరంలో గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ పేరుతో కన్హా శాంతి వనంలో భారీ కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉండటంతో ఉపాసన తన కూతురితో కలిసి వెళ్లారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 16, 2024 / 12:04 PM IST

    Upasana

    Follow us on

    Upasana: చిరంజీవి కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా, బిజినెస్ వుమెన్ గా, ఓ పాపకు తల్లిగా.. ఇలా ఎన్నో పాత్రలను పోషిస్తున్నారు ఉపాసన.. ఈమెకు ఆధ్యాత్మిక, సామాజిక చింతన ఎక్కువ. పైగా అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఉపాసన యాక్టివ్ గా ఉంటారు. అలాంటి ఉపాసన తన కూతురు క్లింకారతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. చిన్నారిని చూసి రాష్ట్రపతి కూడా మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు.

    హైదరాబాద్ మహానగరంలో గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ పేరుతో కన్హా శాంతి వనంలో భారీ కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉండటంతో ఉపాసన తన కూతురితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, గ్లోబల్ స్పిర్చువాలిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమలేష్ దాజీని కలిశారు. వారిద్దరూ ఉపాసన కూతురు క్లింకారను దీవించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఏ ఫోటోల్లో కూడా క్లింకార కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం తను రాష్ట్రపతిని కలిసిన ఫోటోలను, కమలేష్ దాజీని కలిసిన ఫోటోలను మాత్రమే పోస్ట్ చేశారు. ” ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భారత రాష్ట్రపతిని కలిశాను. నాతోపాటు నా కుమార్తె కూడా వచ్చింది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన కమలేష్ దాజీకి ధన్యవాదాలు. ఇది నాకు గొప్ప విషయమంటూ” ఉపాసన ఇన్ స్టా గ్రామ్ లో రాస్కొచ్చింది.

    రాష్ట్రపతి ని కలిసిన సమయంలోక్లింకారను ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకున్నారు. పాప అందంగా ఉందంటూ కితాబిచ్చారు. ఈ సమయంలో క్లింకార ఫోటోలు బయటపడకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు “మెగా ప్రిన్సెస్ క్లింకార ను మాకు ఎప్పుడు చూపిస్తారు. కనీసం ఒక్కసారైనా చూపించండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఉపాసన తన అత్తమ్మ సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని బాల రాముడి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అపోలో క్లినిక్ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.