Unstoppable With NBK- Nara Lokesh: దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే అంటూ అన్ స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ తో సునామీ సృష్టించారు యువరత్న బాలక్రిష్ణ. తొలి షోతోనే క్రేజీ గెస్ట్స్ తో సెకెండ్ సీజన్ అంచనాలను పెంచేశారు. ఒకరు చెల్లెనిచ్చిన బావ చంద్రబాబు అయితే.. మరొకరు పిల్లనిచ్చిన అల్లుడు నారా లోకేష్ కు తన టాక్ షోకు రప్పించి మనసు విప్పి మాట్లాడేలా చేశారు. ప్రోమో ఒక రకమైన ఆసక్తి పెంచగా.. తాజాగా టెలికాస్టు అయిన ఎపిసోడ్ విపరీతంగా స్ట్రీమింగ్ అయ్యింది. దీంతో అందరి దృష్టి అన్ స్టాపబుల్ 2 పై పడింది. అయితే ఈ ఎపిసోడ్ లో ఫన్నీ ఇంట్రస్టెడ్, ఫ్యామిలీ, పొటిటికల్ బ్యాక్ డ్రాప్ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. చంద్రబాబు, లోకేష్ లను పలు ప్రశ్నలు సంధించిన బాలయ్య జనాలకు తెలియని విషయాలను చాలావరకూ వారితోనే బయటపెట్టించి రక్తి కట్టించారు. బావ, బావమరిది, మామ అల్లుడుల మధ్య జరిగిన సరదా సంభాషణలు వీక్షకులను కట్టిపడేశాయి.

అటు పర్సనల్ , పొలిటికల్ లైఫ్ లో జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. లోకేష్ విదేశాల్లో చదువుకున్నప్పుడు స్విమ్మింగ్ ఫుల్ లో దిగిన ఫొటోల గురించి బాలక్రిష్ణ చురకలంటించారు. నువ్వు దిగిన ఫొటో అసెంబ్లీ వరకూ వెళ్లిందని.. దీనిపై మీ కామెంట్ ఏమిటని చంద్రబాబును అడిగితే ఆయన స్పాంటెనిష్ గా స్పందించారు. పిల్లకిచ్చిన మామగా మీకు అభ్యంతరాలు లేనప్పుడు మాకెందుకుంటాయంటూ చంద్రబాబు చమత్కరించారు. దీనిపై లోకేష్ కూడా చాలా కూల్ గా స్పందించారు. తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు.
చదువుకునే రోజుల్లో అవి కామన్ గా చెప్పుకొచ్చారు లోకేష్. కాలేజీ రోజుల్లో అలా ఉండకపొతే ఎలా అని కూడా ప్రశ్నించారు. సరదాగా స్నేహితులతో దిగిన ఫొటోలను అసెంబ్లీ దాకా తీసుకొస్తారని అనుకోలేదన్నారు. ఇప్పటికీ వీరంతా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారని కూడా చెప్పారు. తనకంటే బ్రాహ్మణితో ఎక్కువగా మాట్లాడుతుంటారని.. నాటి స్విమ్మింగ్ ఫుల్ ఫొటో కథా కమామీషు గురించి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అర్ధం చేసుకునే భార్య ఉండగా ఇలాంటివి వచ్చినా పెద్దగా పట్టించుకోకూడదని మామ ముందే నిర్మోహమాటంగా చెప్పారు లోకేష్. కాగా 2007లో బ్రాహ్మణితో లోకేష్ కు వివాహం జరిగింది.

అటు నందమూరి, ఇటు నారా కుటుంబానికి అనుసంధానకర్తగా బ్రాహ్మణి పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెడుతూ వస్తున్నారు. వ్యాపారాలను, కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మామతో అప్పుడప్పుడు రాజకీయ వేదికలను సైతం పంచుకుంటున్నారు. సో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో పర్సనల్ లైఫ్ గురించి లోకేష్, పొలిటికల్ లైఫ్ గురించి చంద్రబాబు వివరించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు.