Unstoppable With NBK Promo: ఒకరు రాష్ట్రాన్ని పాలించిన నేత, మరొకరు సినిమా పరిశ్రమను ఏలే నటుడు ఇద్దరు బంధువులే. బావబావమరుదులే. కానీ ఇద్దరు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇద్దరు బాగా బిజీగా ఉండేవారే. కానీ ఇద్దరు తారసపడిన సందర్భాలు తక్కువే. ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో ఉండిపోయింది. వారి కలయికను చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. వారి బంధుత్వం మీద ప్రేక్షకులకు ఎంతో ఆతృత ఉండటం మామూలే. అలా నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కలిసిన సందర్భాన్ని అందరు ఎంజాయ్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపేబుల్ షో కోసం తన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకున్నాయి. ఆహా కార్యక్రమం ద్వారా వారిని కలిపిన ఘనత దక్కింది. ఇందులో సెషన్ 2లో మొదటి ఎపిసోడ్ లో వీరు ముగ్గురు పాల్గొని అందరిని ఆశ్చర్యపరచనున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన మాటలు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. బాలకృష్ణ డైలాగులు మనకు తెలిసినవే. సినిమాల్లో ఆయన ఒక్కో డైలాగుకు చప్పట్లే చప్పట్లు. ఇందులో కూడా ఆయన మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మీకు బాబు గారు నాకు బావ గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సంబోధన అందరిని ఆకట్టుకుంది. మీ జీవితంలో చేసిన రొమాంటిక్ పని ఏంటని బాలకృష్ణ బాబును అడగ్గా చాలా చేశానని చెప్పడంతో అందరు కంగుతిన్నారు. మీరు సినిమాల్లో చేస్తున్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చేశానని సమాధానం చెప్పారు. మీరు వంట చేస్తారా అంటే నాకు నేనే వండుకోను మీ చెల్లికెలా వండిపెడతానని చెప్పడం గమనార్హం. ఇక అల్లుడు నారా లోకేష్ ను ప్రశ్నిస్తూ మంగళగిరి నుంచి అసెంబ్లీకి వెళ్తానని అనుకున్నా వెళ్లలేకపోవడంపై విచారించగా సంకల్ప బలమైతే ఉంది కానీ అప్పుడు మాత్రం కుదరలేదని చెప్పడంతో కాస్త నిశ్శబ్దం ఆవహించింది.

1995 గురించి చంద్రబాబు నాయుడు బాలయ్యను ప్రశ్నించి అది కరెక్టేనా అని అడగడంతో ఆయన ఏమి చెప్పలేకపోయారు. నాటి పరిస్థితిని గురించి బాధపడ్డారు చంద్రబాబు. ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారే కావడంతో వారి మాటలు వారి గురించే ప్రశ్నలు వేయడంతో కాస్త ఇబ్బందికి గురయినా ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు వారి మనోగతం గురించి మాట్లాడుకోవడం కనిపించింది. దసరా ఈవెంట్ సందర్భంగా వారి మధ్య జరిగిన ఈవెంట్ ఆసక్తికరంగా సాగింది.