Homeఎంటర్టైన్మెంట్Unstoppable: అన్​స్టాపబుల్​ షోలో రవితేజ రచ్చ మాములుగా లేదుగా.. బాలయ్యతో గొడవ నిజమేనా?

Unstoppable: అన్​స్టాపబుల్​ షోలో రవితేజ రచ్చ మాములుగా లేదుగా.. బాలయ్యతో గొడవ నిజమేనా?

Unstoppable: నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే ఓ రకమైన క్రేజ్​ను సంతరించుకున్నాయి.  ఒకప్పుడు ఆయనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. ఈ జనరేషన్​లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆయన అభిమానులే అయిపోయారు. బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ప్రేక్షకులంతా అభిమానులే అంటుంటారు. ఇదే జోరుతో బాలయ్య ఆహా వేదికగా తొలిసారి హోస్ట్​గా వ్యవహరిస్తున్న షో అన్​స్టాపబుల్. ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్స్ షోపై మంచి ఆసక్తిని రేకెత్తించాయి.

స్టార్​ హీరోలు, డైరక్టర్లతో చిట్​చాట్​ పెడుతూ.. పలు ఆసక్తికర విషయాలు బయటకు రప్పిస్తూ.. అందరితో సరదాగా ఆడిస్తూ.. పాడిస్తూ షోను మంచి రక్తి కట్టిస్తున్నారు బాలయ్య.. ఇప్పటి వరకు 5 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో ఎపిసోడ్​లో అల్లు అర్జున్​ను దింపేందుకు సిద్దమైంది. డిసెంబరు 25న ఈ ఎపిసోడ్​ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Unstoppable
Unstoppable Balayya with Ravi Teja

Also Read: బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో లో సందడి చేయనున్న “పుష్ప”రాజ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే

అయితే, తాాజాగా, ఈ ఎపిసోడ్​ రిలీజ్​ కాకముందే ఎపిసోడ్​ 7కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా. ఇందులో మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్​ మలినేనిలను గెస్ట్​లుగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ప్రోమోలో బాలయ్య, రవితేజల మధ్య సంభాషణ అదిరిపోయింది.  ప్రోమో స్టార్టింగ్​లోనే మనిద్దరి మధ్య గొడవలున్నాయంటా..నిజమేనా.. అని బాలయ్య అడగ్గానే.. రవితేజ.. నవ్వుతూ.. పనిపాట లేని డాష్​గాళ్లకు అదే పని అంటూ నవ్వులు పూయిస్తూనే షో స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేక ప్రశ్నలు, సమాధానాలతో పాటు వ్యక్తిగతమైన పలు ఆసక్తికర విషయాలు కూడా ఈ షోలో రవితేజ పంచుకున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. డిసెంబరు 31న ఆహాలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: చిరు, బాలయ్య, మోహన్​బాబులపై గాసిప్స్​ బాగా మాట్లాడుకుంటాం- రాజమౌళి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular