Unstoppable 4: తెలుగు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న టాక్ షోస్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK'(Unstoppable With NBK). ఆహా మీడియా(Aha Media) లో స్ట్రీమింగ్ అయిన ఈ టాక్ షోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఏకంగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షోకి, నాల్గవ సీజన్ తో కూడా కొనసాగించారు. ఈ సీజన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చివరి ఎపిసోడ్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసారు. అదే క్లైమాక్స్ ఎపిసోడ్ అని అంతా అనుకున్నారు. కానీ అసలు సిసలు క్లైమాక్స్ ఎపిసోడ్ రేపు ఉండబోతుందని కాసేపటి క్రితమే ఒక ప్రోమో ని విడుదల చేసింది ఆహా మీడియా టీం. ఈ సీజన్ సీఎం చంద్రబాబు నాయుడు తో మొదలైంది.
ఆ తర్వాత ఈ సీజన్ లో అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రామ్ చరణ్(Global Star Ram Charan), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), సూర్య(Suriya Sivakumar) వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీళ్ళ ఎపిసోడ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ నలుగురితో ఉండబోతుందా?, అసలు ఎందుకు ఈ నలుగురి హీరోల ఎపిసోడ్స్ కి సంబంధించిన బిట్స్ ని పెట్టి ప్రోమో గా విడుదల చేసారు?, అసలు క్లైమాక్స్ ఎపిసోడ్ స్పెషల్ ఏమిటి? అనేది ప్రోమో ని చూసిన ఆడియన్స్ కి అర్థం కాలేదు. అంటే ఈ సీజన్ అన్ని ఎపిసోడ్స్ నుండి హైలైట్స్ కట్ చేసి, ఒక ఎపిసోడ్ గా ఎడిట్ చేసి రేపు విడుదల చేయబోతున్నారా?, లేకపోతే నిజంగా టాప్ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఒక ఈవెంట్ లాగా చేయబోతున్నారా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఈ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక్క ఎపిసోడ్ కి అయినా ముఖ్య అతిథిగా పాల్గొంటాడని అందరూ అనుకున్నారు.
కానీ చిరంజీవి రాలేదు, బాలయ్య జనరేషన్ హీరోలలో కేవలం వెంకటేష్ ని మాత్రమే పిలిచారు. చిరంజీవి తదుపరి సీజన్ లో అయినా వస్తాడో లేదో చూడాలి. బాలయ్య యంగ్ జనరేషన్ హీరోలలో ఎంతమందితో కలిసి ఇంటర్వ్యూస్ చేసినా, చిరంజీవి తో చేస్తే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఎందుకంటే దశాబ్దాల నుండి వీళ్లిద్దరి మధ్య పోటీ బాక్స్ ఆఫీస్ వద్దా నువ్వా నేనా అనే రేంజ్ లో జరిగేది. ఒకప్పుడు నువ్వు చిరంజీవి ఫ్యాన్ వా?, లేదా బాలకృష్ణ ఫ్యాన్ వా? అని అడిగేవారు, ఆ స్థాయిలో వీళిద్దరి క్రేజ్ ఉండేది. అలాంటి హీరోలు చిట్ చాట్ చేసుకుంటే చూడాలని ప్రతీ ఒక్కరికి కోరిక ఉంటుంది, కానీ ఆ అదృష్టం ఇప్పటి వరకు చూసే ఆడియన్స్ కి దక్కలేదు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తే మాత్రం ‘అన్ స్టాపబుల్’ హిస్టరీ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చే ఎపిసోడ్ గా మారిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.