Homeఎంటర్టైన్మెంట్Shobhanbabu Son : శోభన్ బాబు కొడుకు అచ్చం ఆయన లానే ఉన్నాడు. ఇతడెందుకు హీరో...

Shobhanbabu Son : శోభన్ బాబు కొడుకు అచ్చం ఆయన లానే ఉన్నాడు. ఇతడెందుకు హీరో అవ్వలేదంటే..?

Shobhanbabu Son : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు లు వచ్చి వాళ్ళు కూడా స్టార్ హీరోలుగా చాలా సంవత్సరాల పాటు కొనసాగారు.అయితే శోభన్ బాబు మాత్రం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఇలాంటి సమయంలోనే వరుసగా ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ కి చాలా బాగా దగ్గరయ్యారు.

అప్పట్లో అందగాడు అంటే అది శోభన్ బాబు గారు మాత్రమే అనెలా ఆయన చాలా అందంగా ఉండేవారు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు గా కూడా ఆయన గురించి చెప్పేవారు. అలా ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడంతో పాటు చాలా కాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ గా కూడా వెలుగొందాడు. ఇక ఈయన సినిమాల్లో హీరోగా చేసిన తర్వాత మరే సినిమాల్లో కనిపించకుండా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత కూడా ఆయనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన ఏ సినిమాలో కూడా నటించలేదు. కారణం ఏంటంటే ఆయనని ఆడియోన్స్ హీరోగా మాత్రమే చూశారు కాబట్టి ఆయన హీరోగా మాత్రమే ఆడియన్స్ కి గుర్తు ఉండాలి.

అంతే తప్ప తాత క్యారెక్టర్లు, మావయ్య క్యారెక్టర్ చేస్తూ తనకున్న ఇమేజ్ ని తగ్గించుకోలేను అని అప్పట్లో ఆయన కొంతమంది ప్రొడ్యూసర్ లకి చెప్పారట. అయితే మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమాలో నాజర్ చేసిన క్యారెక్టర్ కోసం మొదట ఈయననే అనుకున్నారు. కానీ అది ఆయన రిజెక్ట్ చేయడంతో నాజర్ చేశారు… అయితే శోభన్ బాబు ఇండస్ట్రీకి రాకముందే శాంత కుమారి అనే ఆవిడతో ఆయనకు వివాహం జరిగింది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మద్రాసులోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని దాంట్లో తన భార్య తోపాటు ఆయన కూడా ఉండేవారు.ఇక ఆయనకి ముగ్గురు కూతుళ్ళు , ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే కొడుకు పేరు కరుణ శేషు…

ఈయన కూడా శోభన్ బాబు లాగా చాలా అందంగా ఉంటారు. అయినప్పటికీ ఆయనకి సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఎందుకు రాలేదు అంటే ఆయనకి సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దాంతో శోభన్ బాబు గారు కూడా ఆయనని ఇండస్ట్రీకి రమ్మని ఫోర్స్ చేయలేదు. తనకు నచ్చిన ఫీల్డ్ లో ఉండమని శోభన్ బాబు కూడా ఆయనకి చెప్పారట… దాంతో ఆయన బిజినెస్ రంగంలో వాళ్ల కున్న వ్యాపార సంస్థలను చూసుకుంటూ ఉంటున్నారు. ఇక ఇది తెలిసిన కొంతమంది ఒక హీరో గానీ, ఒక ఆర్టిస్ట్ గానీ ఇండస్ట్రీకి వచ్చాడంటే అతనికి తెలిసిన చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అవుతున్న రోజుల్లో శోభన్ బాబు లాంటి ఒక మంచి హీరో కొడుకు అయిన కూడా కరుణశేషు ఇండస్ట్రీకి రాకపోవడం చాలా బ్యాడ్ అంటూ శోభన్ బాబు ఫ్యాన్స్ కూడా అప్పట్లో చాలా ఆవేదన వ్యక్తం చేశారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version