
మూవీ మొఘుల్ డా. రామానాయుడు మనవడిగా, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ‘రానా’ నిజంగా తానూ కోరుకుంటే భారీ సినిమాలతోనే ఎంట్రీ ఇవ్వొచ్చు. కానీ మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా తనలోని విభిన్న కోణాలని బయటపెడుతూ వైవిధ్యమైన నటుడిగా ఇండియా వైడ్ గా అసాధారణ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ రోజు రానా పుట్టిన రోజు. రానా 14 డిసెంబర్ -1984న జన్మించారు. రామానాయుడు పేరుని తన కొడుకుకి పెట్టుకున్నారు సురేష్ బాబు. అలా ముద్దుగా రానా అని పిలవటంతో అదే పేరు ఆయనకి అసలు పేరులా మారిపోయింది. ఇక రానాకి చిన్నప్పటినుండి సినిమా మీద అమితమైన ఇష్టం. తాత రామానాయుడులానే సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలనే చిన్నతనంలో కలలు కనేవారట. అప్పుడప్పుడు తాతతో సినిమా షూటింగ్ లకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న పని గురించి, పరికరాల గురించి ఎంతో శ్రద్దగా తెలుసుకునేవాడట. అలా అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్నాక తనకు తానుగా ఓ స్టూడియో కూడా పెట్టుకున్నాడు.
Also Read: ‘నారప్ప’ ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది – విక్టరి వెంకటేష్.
ఇక హీరోగానే కాకుండా ఆర్టిస్ట్ గా , నిర్మాతగా, అనేక విభాగాలలో రానా రాణిస్తున్నాడు. తనకు సినిమాకి సంబంధించి ఏ పని చేయడానికైనా ఆనందాన్ని ఇస్తుందని.. అసలు నటన కన్నా ప్రొడక్షన్ అంటేనే కొంచెం ఎక్కువగా ఇష్టమని రానా చెబుతుంటాడు. అన్నట్లు రానా మొదట కొంతకాలం సాంకేతిక నిపునణిడిగా కూడా పనిచాశాడు, మహేష్ బాబు హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సైనికుడు మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు కూడా రానా తీసుకున్నాడు. ఆ తర్వాత తాత కోరిక మేరకు నటనలో శిక్షణ తీసుకుని శేఖర్ కమ్ములా దర్శకత్వంలో లీడర్’ మూవీ ద్వారా హీరోగా ఆరంగ్రేటం చేశాడు. మాస్ ఇమేజ్ కోసం ఆలోచించకుండా వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. తరువాత హిందీ మూవీ ‘దమ్ మారో దమ్’ లో నటించి అందరికి షాక్ ఇచ్చారు. వరుసగా నేను నా రాక్షసి, నా ఇష్టం, డిపార్ట్మెంట్ , కృష్ణం వందే జగద్గురం చిత్రాలలో నటించినా.. బాహుబలి లో ప్రతినాయకుడిగా నటించి ఇండియా మొత్తం తనంటే ఏంటో చూపించాడు.
Also Read: ఇంటిని ముస్తాబు చేస్తోన్న సమంత !
ఇక సమంత హోస్ట్‌గా వ్యవహరించే ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన జీవితం గురించి , ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్ మీద స్పందించాడు. జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని, పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా అన్నాడు. ‘‘నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్‌కు(మెదడులో నరాలు చిట్లిపోవడం) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంది’ అని వైద్యులు చెప్పారన్నాడు. ఈ విషయం చెప్పే క్రమంలో రానా కంటతడి పెట్టుకున్నాడు. వెంటనే సమంత స్పందిస్తూ ‘మీ చుట్టు జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వయంగా చూశాను. మీరు నిజంగా సూపర్ హీరో’ అని చెప్పి రానాని ఆ మూడ్ నుండి బయటకి తీసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
రానాకి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు ఉందో అలానే ఆయన మీద అనేక రూమర్స్ కూడా ఉన్నాయి. అనేకమంది హీరోయిన్స్ తో డేట్ చేస్తునట్లుగా ఎప్పుడు వార్తల్లో ఉండేవారు. హిందీ నటి బిపాసా బసు మరియు డస్కీ బ్యూటీ త్రిషతో అఫైర్స్ అయితే చాలా ఎక్కువగా ఆయన ఇమేజ్ డామేజ్ చేశాయి. వాటిలో కొన్నిటిని రానా నిజమేనని ఒప్పుకున్నారు. ఇక ఇండస్ట్రీలో రానాకి రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, మంచు లక్ష్మి లాంటి క్లోజ్ స్నేహితులు ఉన్నారు. రానా ఎప్పుడూ పార్టీలతో మునిగి తేలుతుంటాడని అందరూ గుసగుసలాడతారు. రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని ఇటీవల పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ గురించి మాట్లాడుతూ మిహికాతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని చాలా అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇలానే హ్యాపీగా రానా జీవితం ఉండాలని, తాత, తండ్రి, బాబాయ్ వెంకటేష్ లాగ ఉన్నత స్థానాలని చేరుకోవాలని కోరుకుంటూ… జన్మ దిన శుభాకాంక్షలు.