https://oktelugu.com/

ఆ స్టార్ కి మంచితనమే పెనుశాపం అయింది !

‘పీపుల్స్‌ స్టార్‌’ అంటూ నారాయణమూర్తికి బిరుదు ఇచ్చి, నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్న రోజులు అవి. అప్పటికే ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతూ పేదవాళ్ల హీరోగా నారాయణమూర్తి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న కాలం అది. పైగా విప్లవ సినిమాలు ఆడుతున్న తరుణమది. అందుకే ఎంతోమంది నిర్మాతలు ‘నారాయణమూర్తి’తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. స్వతహాగా వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి, తనకు వచ్చిన డిమాండ్ ను సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలని […]

Written By:
  • admin
  • , Updated On : May 18, 2021 / 04:58 PM IST
    Follow us on

    ‘పీపుల్స్‌ స్టార్‌’ అంటూ నారాయణమూర్తికి బిరుదు ఇచ్చి, నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్న రోజులు అవి. అప్పటికే ఆయన నటించిన సినిమాలన్నీ అద్భుతమైన కలెక్షన్స్ ను రాబడుతూ పేదవాళ్ల హీరోగా నారాయణమూర్తి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న కాలం అది. పైగా విప్లవ సినిమాలు ఆడుతున్న తరుణమది. అందుకే ఎంతోమంది నిర్మాతలు ‘నారాయణమూర్తి’తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు.

    స్వతహాగా వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి, తనకు వచ్చిన డిమాండ్ ను సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలని ‘నారాయణమూర్తి’ ప్రయత్నించలేదు. పైగా తానూ మొదటి సినిమా చేయడానికి తనకు సాయం చేసిన కొంతమంది మిత్రుల రుణం తీర్చుకోవాలని నారాయమూర్తి నిర్ణయించుకున్నారు. తన మిత్రులకు ఎలాగైనా మంచి సినిమాలు చేసి, వారికి ఆర్థికంగా లాభం చేకూర్చాలనేది నారాయణమూర్తి ఆశ.

    ఆ ఆలోచనతోనే నిర్మాత పోకూరి బాబూరావుగారికి ఒక సినిమా చేయాలని నారాయణమూర్తి ప్లాన్ చేశారు. నారాయణమూర్తి హీరోగా మారుతున్న సమయంలో పోకూరి బాబూరావు చిన్న మాట సాయం చేశారట. అది దృష్టిలో పెట్టుకుని నారాయణమూర్తి సబ్జెక్ట్‌ రెడీ చేయించి ఆయనకు డేట్స్ ఇచ్చాడు. ఇక పోకూరి బాబూరావుకి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అంటే నమ్మకం ఎక్కువ. అందుకే ఆయన దగ్గరకు వెళ్లి ‘సుబ్బన్నా.. నారాయణమూర్తి నాకు సినిమా చేస్తున్నాడు, నువ్వే డైరెక్ట్ చేయాలి’ అంటూ ప్రపోజల్ పెట్టారు బాబూరావు.

    అలా వచ్చిందే ‘ఎర్రోడు’ సినిమా. మంచి మనసుతో నారాయణమూర్తి డేట్స్ ఇచ్చినా.. ‘ఎర్రోడు’ సినిమా ఆ రోజుల్లో హిట్ అవ్వలేకపోయింది. ఒక విధంగా నారాయణమూర్తి మార్కెట్ తగ్గడానికి పునాదిగా నిలిచింది ఎర్రోడు సినిమా. అయితే, ఆ రోజుల్లో ఆ సినిమా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కానీ హిట్‌ అవ్వకపోవడానికి ముఖ్యకారణం నారాయణమూర్తి పై డ్యూయెట్లు పెట్టడమే.

    నారాయణమూర్తిని అభిమానించే వాళ్లకు అవి అసలు నచ్చలేదు. కానీ నారాయణమూర్తిని కమర్షియల్ హీరోగా పెంచాలనే ఆలోచనతో, కాస్త మోడరన్‌గా చూపించాలనే ఆశతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య కొత్త ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అయితే ఈ సినిమా వల్ల లాభపడ్డారు నిర్మాత బాబూరావు. మంచి రేట్లకు సినిమాని అమ్మారు. నారాయణమూర్తి పై నమ్మకంతో బయ్యర్లు కూడా ఎక్కువ పెట్టి సినిమాని కొన్నారు. దాంతో కొన్నవాళ్ళు అంతా భారీగా నష్టపోయారు. ఆ నష్టాలు వల్లే నారాయణమూర్తి సొంత సినిమాలను తక్కువ రేట్లుకు అమ్మాల్సి వచ్చింది. చివరకు నారాయణమూర్తి మంచి తనమే ఆయనకు శాపంలా మారింది.