Bigg Boss 9 Telugu Ayesha Khan: నిన్న బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టిన వారిలో చాలా క్యూట్ గా అనిపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు అయేషా ఖాన్. చూసేందుకు చాలా అందంగా ఉంది, చాలా చలాకీగా కూడా మాట్లాడుతుంది. ఈమె గతంలో స్టార్ మా ఛానల్ లో ‘ఊర్వశివో..రాక్షసివో’ అనే సీరియల్ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే ఎంటర్టైన్మెంట్ షోలో కూడా ఈమె ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. సీజన్ 8 లోనే ఈమె కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంది అంతా అనుకున్నారు కానీ, సీజన్ 9 కి కుదిరింది. అసలు ఎవరు ఈ అయేషా?, ఇంతకు ముందు ఈమె చేసిన సీరియల్స్ ఏమిటి?, సినిమాల్లో కూడా నటించిందా?, ఇలాంటి విషయాలు క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
అయేషా తమిళనాడు కి చెందిన అమ్మాయి. ఈమె 1997 వ సంవత్సరం లో జన్మించింది. చిన్న తనం నుండే నటనపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న ఆయేషా, పోంమగళ్ వందాల్ అనే తమిళ సీరియల్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఆడియన్స్ కి దగ్గరైన ఈమె, సత్య అనే తమిళ్ సీరియల్ లో టామ్ బాయ్ క్యారక్టర్ చేసి ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ గా మారిపోయింది. ఇదే సీరియల్ ని తెలుగు లో జీ తెలుగు ఛానల్ లో ‘సూర్య కాంతం’ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఆ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది. అంతే కాదు, ఈమె తమిళ బిగ్ బాస్ లో ఏకంగా 65 రోజులు కొనసాగింది. కచ్చితంగా టాప్ 5 లోకి వెళ్లగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్, కానీ అనవసరమైన లవ్ ట్రాక్ ని నడిపి, తన గ్రాఫ్ ని బాగా తగ్గించుకొని, ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.
ఇదే విషయాన్నీ నిన్న నాగార్జున తో కూడా పంచుకుంది. ఈసారి ఎలాంటి లవ్ ట్రాక్స్ ఉండవని, టైటిల్ కొట్టడమే టార్గెట్ అని కూడా చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈమెకు ఒక ప్రైవేట్ విమానం కూడా ఉంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేవలం సీరియల్స్ చేసి సొంత విమానం ని కొనేంత డబ్బులు సంపాదించిందా?, అసలు ఎలా సాధ్యం అంటూ సోషల్ మీడియా లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. సీరియల్స్ కేవలం టైం పాస్ కోసం చేస్తుందేమో, ఆమె చిన్నప్పటి నుండి బాగా డబ్బున్న అమ్మాయి కావొచ్చు అని మరికొంతమంది అనుకునేవారు. కానీ ఆ ప్రైవేట్ ఫ్లైట్ తనది కాదని, తన స్నేహితులది అని నిన్న కాస్త క్లారిటీ ఇచ్చింది కానీ, పూర్తి స్థాయి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. చూడాలి మరి ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో హౌస్ లో ఎలాంటి ఫైర్ ని పుట్టిస్తుంది అనేది.