Hollywood: సినిమా సూటింగ్ సమయంలో అనుకోని రీతిలో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఘటనల్లో నటీనటులు లేదా మూవీ యూనిట్ లో ఎవరో ఒకరు గాయాల పాలవ్వడం తెలిసిన విషయమే. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన డమ్మీ గన్ పేలడంతో ఒకరు మృతి చెందగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా ఇండస్ట్రి లోని వారంతా ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. కాకపోతే ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదు హాలీవుడ్ లో.

అమెరికాలోని న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్ లో “రస్ట్” అనే హాలీవుడ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. షూట్ లో ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్ విన్ చేతిలోని డమ్మీ తుపాకీ పేలింది. దాంతో అక్కడే ఉన్న మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా… డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. సినిమాటోగ్రాఫర్ చేతిలోని గన్ పేలడంతో… బాధితులను వెంటనే హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ… హల్యానా హచిన్స్ మరణించారు. తీవ్రంగా గాయపడిన డైరెక్టర్ జోయల్ సౌజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగానే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని సమాచారం. మృతి చెందిన హల్యానా కు పలువురు నటీనటులు సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా షూట్ సమయంలో కూడా ప్రమాదం జరిగి పలువురు మరణించిన విషయం తెలిసిందే.