https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఊహించని ట్విస్ట్… సూట్ కేసు తీసుకుని శివాజీ బయటకు! ఎన్ని లక్షలు ఉన్నాయంటే?

అందరూ కర్రలతో కుమ్మేసి కసి మొత్తం తీర్చుకున్నారు. ఆ తర్వాత శివాజీ కుర్చీలో కూర్చున్నాడు. శివాజీ కాసేపటికే ఈజీగా యావర్ అంటూ చెప్పాడు. దీంతో యావర్ గంతలు కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 06:14 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని విధంగా సాగుతుంది. ప్రతి సీజన్ లో ఫినాలే రోజు సెలెబ్రెటీ తో బ్రీఫ్ కేస్ పంపిస్తాడు బిగ్ బాస్. కానీ ఉల్టా పుల్టా సీజన్ లో శనివారం ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాజా ప్రోమోలో ముందుగా కంటెస్టెంట్స్ తో ఓ ఫన్నీ గేమ్ నిర్వహించాడు బాగ్ బాస్. ప్రతి ఒక్కరి కళ్ళకు గంతలు కట్టి, తలకు హెల్మెట్ పెట్టి సరదాగా ఆట ఆడించాడు. ముందు అమర్ కళ్లకు గంతలు కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు.

    ఇక అందరూ కర్రలతో కుమ్మేసి కసి మొత్తం తీర్చుకున్నారు. ఆ తర్వాత శివాజీ కుర్చీలో కూర్చున్నాడు. శివాజీ కాసేపటికే ఈజీగా యావర్ అంటూ చెప్పాడు. దీంతో యావర్ గంతలు కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. దీంతో యావర్ కి హౌస్ మేట్స్ చుక్కలు చూపించారు. ఇక చివర్లో ప్రశాంత్ ని అందరూ కలిసి ఒక ఆట ఆడుకున్నారు. శివాజీ, అమర్ ఇద్దరు కలిసి ప్రశాంత్ ని గట్టిగా కుమ్మేసారు. ఈ టాస్క్ ఫన్నీ ఫన్నీ గా సాగింది.

    ఆ తర్వాత హౌస్ మేట్స్ కోసం ఓ బ్రీఫ్ కేస్ పంపించాడు బిగ్ బాస్. మీ ముందున్న బ్రీఫ్ కేస్ లో రూ . 10 లక్షలు ఉన్నాయి. దాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారా అంటూ బిగ్ బాస్ అడిగాడు. దీంతో ఒక్కొక్కరు ఆ బ్రీఫ్ కేసు ని పట్టుకుని కాసేపు నిల్చున్నారు. చివరికి శివాజీ సూట్ కేస్ ని పట్టుకున్నాడు. దీంతో పది లక్షలు తీసుకుని శివాజీ బయటకు వచ్చాడేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. లేటెస్ట్ ప్రోమో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ శివాజీ టెంప్ట్ అయ్యాడా లేక మరొక కంటెస్టెంట్ ఎవరైనా డబ్బులు తీసుకుని రేసు నుండి తప్పుకున్నారో చూడాలి.

    ఫినాలే ముందే బ్రీఫ్ కేస్ డ్రామా షురూ చేసిన బిగ్ బాస్ కేవలం 10 లక్షలు మాత్రమే ఆఫర్ చేయడం ఘోరం. దీనికి హౌస్ మేట్స్ ముందుకు వచ్చి బ్రీఫ్ కేస్ తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇంత తక్కువ అమౌంట్ కోసం ఎవరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అందులోనూ ఈసారి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపలేదు. ఎవరి పొజీషన్ ఏమిటో తెలిసే అవకాశం లేదు. కాబట్టి డబ్బు తీసుకుని ఎవరూ రేసు నుండి తప్పుకోకపోవచ్చు…