Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ ఎట్టకేలకు తేల్చింది. ఈ కేసు విచారణ గురించి మీడియాలో బోలెడంత ప్రచారం జరిగింది. సినీ ప్రముఖులు మత్తుకు బానిసయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం కావాలనే వారి పేర్లు బయటకు చెప్పడం లేదనే విమర్శలూ వచ్చాయి. కాగా, ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసును తేల్చేసింది. అయితే, ఇందులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే..

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యారనే విషయం తెలియగానే మీడియా వారిమీద స్పెషల్ ఫోకస్ చేసింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన సెలబ్రిటీలు ఇలా ఎందుకు చేస్తున్నారని రకరకాల కథనాలు ప్రసారం చేశాయి. ఈ క్రమంలోనే తొలుత తెలంగాణ ప్రభుత్వం అబ్కారీ శాఖ ఈ కేసును తీసుకుని విచారణ చేపట్టింది. అయితే, తర్వాత కాలంలో కేసు ఈడీకి బదిలీ కాగా, వారు రంగంలోకి దిగారు. అబ్కారీ శాఖ అధికారులు 2017 జులైలో కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుంచి మత్తు మందులు రికవరీ చేశారు.
ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాలు టాలీవుడ్ సెలబ్రిటీలకు సప్లై అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ఉన్నారనే వార్తలు బయటకు పొక్కాయి. దాంతో డ్రగ్స్ కేసుకు బాగా పాపులారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులను గంటల తరబడి విచారించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఆధారంగా సెలబ్రిటీలను ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేశారు.
మొత్తంగా సెలబ్రిటీల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత సెలబ్రిటీలు డ్రగ్స్ వినియోగిస్తున్నారా? లేదా? అనేది తేల్చేందుకు వారి గోళ్లు, వెంట్రుకలు సేకరించారు. వాటిని టెస్టింగ్‌కు పంపించారు. దాదాపు మూడేళ్ల పాటు కేసును విచారించారు. అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత ఆఖరుకు డ్రగ్స్ వాడకంపై ప్రాథమికంగా ఆధారాలేవీ లభించలేదని ధ్రువీకరించారు. ఈ వార్త సెలబ్రిటీలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
Also Read: ఈ చెవిలో పువ్వు ప్రోమోలు ఆపరా… ఎన్నాళ్లు మోసం చేస్తారు!
అప్పట్లో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా, రవితేజ, పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ఈడీ విచారణకు పిలిచిన సందర్భంలో మీడియా తెగ హడావిడి చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే, తాజాగా సెలబ్రిటీలు మత్తు మందులు తీసుకుంటున్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఈడీ తెలపడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు క్లోజ్ అయింది. ఇన్ని రోజులు విచారణ చేసి ఈడీ చివరకు ఏం జరగలేదని తేల్చింది. ఈ విషయం తెలుసుకుని కొండను తవ్వి కనీసం ఎలుకనూ పట్టుకోలేకపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: ఎలిమినేటైన ప్రియాంక మరలా అలా హౌస్ లో ప్రత్యక్షమైంది