Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2లో ఊహించని సర్ప్రైజ్ లు, ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో...

Pushpa 2: పుష్ప 2లో ఊహించని సర్ప్రైజ్ లు, ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో పాటు కెజిఎఫ్ 2 విలన్!

Pushpa 2: పుష్ప 2 పై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతగా పుష్ప అక్కడి ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో పార్ట్ 1 కి మించి పార్ట్ 2 సిద్ధం చేస్తున్నారు. పుష్ప 2 లో ఊహించని సర్ప్రైజ్ లు ఎన్నో ఉన్నాయని సమాచారం. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో పాటు క్రేజీ విలన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే ఓ షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేశారు. వెంటనే హైదరాబాద్ లో లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభించినట్లు సమాచారం.

పుష్ప 2 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. చెప్పిన తేదీకి రావాలని టీమ్ బాగా కష్టపడుతున్నారు. కాగా పుష్ప 2 భారీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో సమంత మరోసారి ఐటెం సాంగ్ చేయనుందట. పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికీ సమంతవైపే మొగ్గు చూపారని సమాచారం. అలాగే జాన్వీ కపూర్ కేమియో ఉంటుందట. కెజిఎఫ్ 2లో విలన్ గా ఆడియన్స్ ని భయపెట్టిన సంజయ్ దత్ సైతం గెస్ట్ రోల్ చేస్తున్నారట.

సమంత, జాన్వీ కపూర్, సంజయ్ దత్ లు పుష్ప 2లో భాగం అయ్యారనేది లేటెస్ట్ న్యూస్. సమంత ఐటెం సాంగ్ కొరకు కాగా, జాన్వీ కపూర్ రోల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక సంజయ్ దత్ చివర్లో ఎంట్రీ ఇచ్చే సూచనలు కలవు. పుష్ప 3 ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ కథకు లీడ్ ఇచ్చేందుకు సంజయ్ దత్ పాత్రను పరిచయం చేయవచ్చు. పుష్ప లో సైతం చివర్లో ఫహాద్ ఫాజిల్ పాత్రను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా పరిచయం చేశాడు.

అయితే సమంత, జాన్వీ, సంజయ్ దత్ పుష్ప 2లో నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular