Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో నామినేషన్స్ ఇంకా ఎలిమినేషన్ నుంచి అర్జున్ సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రియాంక, శివాజీ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.
ముందు నుంచి సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్. వాళ్లు గేమ్ ఆడినా .. ఆడకపోయినా .. శోభా శెట్టి అడ్డదిడ్డంగా నోరేసుకుని పడిపోయినా .. ప్రియాంక ఎన్ని తప్పులు చేసినా నాగార్జున మాత్రం మీరు బంగారం అమ్మ అంటూ పొగిడేస్తారు. అదే వేరేవాళ్లు చిన్న తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తారు. సీరియల్ బ్యాచ్ లో అమర్, ప్రియాంక లు సేఫ్ అవుతున్నారంటే అర్థముంది.
మరి నామినేషన్ లో ఉన్న ప్రతి సారి శోభా లిస్ట్ ఓటింగ్ తో ఉంటుంది .. కానీ ఎలా సేవ్ అవుతుంది అనేది అంతుచిక్కని ప్రశ్న. తన దత్తపుత్రికను కాపాడుకునేందుకు బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బలి చేస్తున్నారు. గతంలో ఒకసారి దత్తపుత్రిక ను సేవ్ చేడయం కోసం ఎలిమినేషన్ ఎత్తేశారు బిగ్ బాస్. ఇక 13వ వారంలో శోభా కంటే ఓట్లు తక్కువ వచ్చాయి అంటూ గౌతమ్ ని బయటకి పంపించారు.
అయితే ఈ వారం కూడా సీరియల్ బ్యాచ్ ని కాపాడుకునేందుకు యావర్ ని ఎలిమినేట్ చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఇది జరిగేలా కనిపించడం లేదు. ఈ సీజన్ లో 13 రోజుల ముందే ఓటింగ్ ప్రారంభం అయింది. ఆడియన్స్ తమకు నచ్చిన వారిని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్, శివాజీ, యావర్ లకు తెగ ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం యావర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అమర్, శోభా, ప్రియాంక చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో నుంచి ఒకరు అంటే శోభా.. అమర్, ప్రియాంక ల కంటే లీస్ట్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ తప్పదు.