Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్, ఎన్టీఆర్ నుండి ఊహించని స్పందన.. టాలీవుడ్ లో అతి పెద్ద చర్చ

Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్, ఎన్టీఆర్ నుండి ఊహించని స్పందన.. టాలీవుడ్ లో అతి పెద్ద చర్చ

Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణకు విబేధాలు ఉన్నదని నిజం. అందుకు రాజకీయ సమీకరణాలు ప్రధానంగా కారణం అయ్యాయనే వాదన ఉంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అనంతరం ఎన్టీఆర్, హరికృష్ణ టీడీపీకి దూరం అవుతూ వచ్చారు. టీడీపీలో ఎన్టీఆర్ కి ప్రాధాన్యత పెరగ కూడదని చంద్రబాబు, బాలకృష్ణ కోరుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ సైతం టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాజకీయంగా ఎన్టీఆర్ క్రియాశీలకంగా లేరు.

బాబాయ్ బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు కూడా ఎన్టీఆర్ హాజరుకాలేదు. అలాగే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు సైతం డుమ్మా కొట్టాడు. నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై బాలకృష్ణ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేయడం ఊహించని పరిణామం.

ఇక ఎన్టీఆర్-బాలకృష్ణ కలవడం కష్టమే అనుకుంటున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డు వరించింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు చిత్ర ప్రముఖులు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. అనూహ్యంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇండియన్ సినిమాకు బాలా బాబాయ్ చేసిన సేవలకు గుర్తుగా పద్మభూషణ్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ పరిణామం అనంతరం బాలకృష్ణతో ఎన్టీఆర్ కి విబేధాలు లేవు. వారు ఎప్పుడూ ఒకటే అంటున్నారు జనాలు. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్యను అభినందించడాన్ని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్-బాలయ్యల అనుబంధం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నారు.

త్వరలో వారిద్దరినీ ఒకే వేదికపై చూడటం ఖాయం అంటున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఇక వరుస హిట్స్ తో బాలకృష్ణ జోరు మీదున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్, దేవర చిత్రాలతో భారీ హిట్స్ నమోదు చేశాడు. వార్ 2 మూవీతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

RELATED ARTICLES

Most Popular