Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 14వ వారం రసవత్తరంగా సాగుతోంది. అయితే కంటెస్టెంట్స్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కొట్టుకుంటున్నారు. బాల్స్ టాస్క్ లో అమర్, ప్రశాంత్ ఓ రేంజ్ లో తన్నుకున్నారు. అమర్ కొరికాడు అంటూ ప్రశాంత్ ఆరోపించడంతో .. అమర్ రెచ్చిపోయాడు. ఇద్దరూ ధూషించుకుంటూ రచ్చ చేశారు. అమర్ అయితే పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించాడు. బూతులు మాట్లాడుతూ ప్రశాంత్ పై మాటల దాడికి దిగాడు. నేను వెళ్ళిపోయినా పర్లేదు. ప్రశాంత్ డబుల్ గేమ్ బయటపెట్టే పోతానని శబధం చేశాడు. అలాగే యావర్, శోభ శెట్టి కూడా గొడవపడ్డారు. ఇది ఇలా ఉండగా .. కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. మాటలు వినిపించడం తప్ప .. అసలు కంటికి కనిపించని బిగ్ బాస్ బొమ్మ గీయాలి అంటూ ఇరికించాడు.
‘ మీ ఊహల్లో బిగ్ బాస్ ఎలా ఉంటారో డ్రా చెయ్యాలి అంటూ బిగ్ బాస్ విచిత్రమైన టాస్క్ ఇచ్చారు. దీంతో ఇంటి సభ్యులు తమ ప్రతిభను బయటికి తీశారు. ఎవరికి తోచిన విధంగా వారు బొమ్మ గీయడం మొదలు పెట్టారు. అమర్ దీప్ గీస్తున్న బొమ్మ చూసి బిగ్ బాస్ కి డౌటొచ్చింది. గీస్తుంది నా బొమ్మేనా అని బిగ్ బాస్ అనడంతో అమర్ ఏదో చెప్పి కవర్ చేశాడు. ఇక తర్వాత నా బొమ్మకి మెడ లేదా అంటూ శోభా ని ఏడిపించారు.
యావర్ మీరు గీస్తుంది నన్నా లేక జీనినా అంటూ కామెడీ చేశారు బిగ్ బాస్. ఇక మధ్యలో శివాజీ టైమింగ్ భలే ఉంది. ఈ రోజు ఏడు ఎలిమినేషన్స్ కన్ఫర్మ్ అంటూ పంచులు వేసాడు. కొద్దిసేపటి తర్వాత వారు గీసిన బొమ్మ గురించి ఒక్కొక్కరిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటగా అర్జున్ ‘ ఇది నా ఊహల్లో మీరు .. మాకు గురువు అంటూ ఏదో చెప్పాడు. తర్వాత శివాజీ ‘ఒక గ్లోబ్ .. బిగ్ బాస్ కన్ను వేసి .. సమస్త భూమండలం బిగ్ బాస్ కనుసన్నల్లోనే ఉంటుందని నా అభిప్రాయం అంటూ శివాజీ చెప్పాడు.
ఇక అమర్ దీప్ ‘ మీరు కళ్ళు తెరవగానే వెలుతురు .. కాంతి రేఖలు అంటూ ఏదేదో చెప్పాడు. నాకు ముక్కు లేదా అమర్ అంటూ పంచ్ వేశారు బిగ్ బాస్. ఇక చివరగా శోభ ప్రయత్నం చేసింది. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో ఎపిసోడ్ ముగిసింది.