Umair Chand On Jawan: సినిమాలు రిలీజ్ కాకముందే ఆ సినిమా గురించి చెప్పే వాళ్లలో ఉమైర్ చంద్ ఒకరు. దుబాయ్ లో నివాసం ఉంటున్న సినిమా గురించి ముందే తెలుసుకొని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఇప్పటి వరకు ఆయన సినిమా గురించి చెబితే అది కచ్చితంగా జరుగుతుందని కొందరి నమ్మకం. దీంతో ఆయనకు ఫాలోవర్స్ చాలా పెరిగారు. ఆయన నుంచి రివ్యూ ఎప్పుడు వస్తుందా? అని కొందరు ఎదురుచూస్తారు కూడా. ఈ తరుణంలో కొందరు సినీ జనాలు కూడా ఉమైర్ చంద్ ఏం చెబుతాడోనని ఆసక్తి చూపుతారు. తాజాగా షారుఖ్ హీరోగా వచ్చిన ‘జవాన్’పై ఎవరూ ఊహించని విధంగా రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా సినీ జనాలను అలరిస్తున్నాడు. ఏజ్ బార్ అయినా నేటి కుర్రాళ్లలో తన నటనతో జోష్ నింపుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘పఠాన్’ మూవీతో అలరించిన షారుఖ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘జవాన్’తో థియేటర్లోకి వచ్చాడు. బాలీవుడ్ హీరో అయిన షారుఖ్ కేవలం హిందీ నటులనే కాకుండా సౌత్ స్టార్స్ తో కలిసి నటించడం విశేషం. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా.. దీపికా పదుకునే ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.
తమిళ దర్శకుడు అట్లీ తీసిన ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అట్లీ ఇళయ దళపతి విజయ్ పోలీసోడు, అదిరింది అనే తదితర సక్సెస్ సినిమాలను అందించాడు. అయితే మొదటిసారిగా బాలీవుడ్ లో.. అదీ స్టార్ హీరో షారుఖ్ తో సినిమా తీయడంపై అంచనాలు మొదటి నుంచే ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూసి ఇవి మరింత పెరిగాయి. దీంతో జవాన్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
జవాన్ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూని ఉమైర్ చంద్ తెలిపారు. ఇప్పటి వరకు ఉమైర్ చంద్ ఏ సినిమాలోనైనా తప్పులు వెతికి సినిమా గురించి బ్యాడ్ గా చెప్పేవారు. కానీ ఫస్ట్ టైం ‘జవాన్’ సినిమాను ప్రశంసించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ‘జవాన్ షారుఖ్ టాలెంట్ ని జస్టిస్ చేసింది. ఈ సినిమాతో ఆయనకు మంచి ఇంప్రెసన్ వస్తుంది.ఒక మంచి కథలో నటించే అవకాశం షారుఖ్ కు వచ్చింది. ఆత్మవిశ్వాసంతో ఇలాంటి ఫిజికల్ యాక్షన్ ఉన్న సవాళ్లను షారుఖ్ ఇప్పటికీ ఎదుర్కోవడం గ్రేట్’ అని ప్రశంసించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అసలు విషయం తెలుస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.