Photo Story: ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పాన్ ఇండియా హీరోలు.. ఎవరో చెప్పండి..

ఎంతో ముద్దొస్తున్న ఈ బ్రదర్స్ ఎవరో కాదు ఒకరు సూర్య, మరొకరు కార్తీ. వీరు తమిళ నటులు అయినా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య తన నటనతో జాతీయ అవార్డును కూడా తెచ్చుకున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : September 7, 2023 5:02 pm

Photo Story

Follow us on

Photo Story: పెరిగి పెద్దయ్యాక చిన్న నాటి ఫొటోలను చూస్తే ఒక్కసారిగా పాత రోజుల్లోకి వెళ్లిపోతాం. ఈ మధ్య సినీ సెలబ్రెటీలు తమ చిన్ననాటి పిక్స్ కు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దీంతో వారి అభిమానులు వాటికి లైక్స్ కొడుతూ సందడి చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇద్దరు హీరోలు చిన్నప్పుడు ఒకే ఫ్రేములో ఉన్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. వీరిద్దరు స్టార్ హీరోలే కాకుండా అన్నదమ్ములు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే కిందికి వెళ్లండి.

ఎంతో ముద్దొస్తున్న ఈ బ్రదర్స్ ఎవరో కాదు ఒకరు సూర్య, మరొకరు కార్తీ. వీరు తమిళ నటులు అయినా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య తన నటనతో జాతీయ అవార్డును కూడా తెచ్చుకున్నాడు. అన్నతో పాటు తమ్ముడు కార్తీ కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. సూర్య గజిని మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’లో నేరుగా నటించారు. ఇక సింహం సినిమాలతో సూర్య టాలీవుడ్ స్టార్ కూడా అయ్యారు.

అటు కార్తీ కూడా తన మొదటి సినిమా ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత ఆవారా, నాపేరు శివ తో మరింత పేమస్ అయ్యారు. రెండు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీరు చిన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి ఉండేవారట. తల్లిదండ్రులతో షాపింగ్ వెళ్లినప్పుడు తీసుకున్న ఓ పిక్ ను వీరి ఫ్యాన్స్ నెట్టింట్లో ఉంచారు. ఈ పిక్ ఇప్పుడు వైరల్ గామారుతోంది. మరి మీరు కూడా ఈ పిక్ కు లైక్ కొట్టండి..