https://oktelugu.com/

Singer Chinmayi: సింగర్ చిన్మయి కి మద్దతుగా నిలిచిన ఆ ఇద్దరు… ఎవరంటే ?

Singer Chinmayi: చిన్మయి శ్రీపాద… గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెచ్చుకున్న పాపులారిటీ కంటే, సోషల్ మీడియా ద్వారా ఆమె ఇంకా ఎక్కువ గుర్తింపు పొందింది అని చెప్పవచ్చు. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న వేధింపులు, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది చిన్మయి. అలాగే ఎంతో మంది అమ్మాయిలు తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్పు సలహాలు తీసుకుంటుంటారు. ఇటీవల అమ్మాయిల వివాహం, కట్నం […]

Written By: , Updated On : December 8, 2021 / 04:45 PM IST
Follow us on

Singer Chinmayi: చిన్మయి శ్రీపాద… గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెచ్చుకున్న పాపులారిటీ కంటే, సోషల్ మీడియా ద్వారా ఆమె ఇంకా ఎక్కువ గుర్తింపు పొందింది అని చెప్పవచ్చు. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న వేధింపులు, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది చిన్మయి. అలాగే ఎంతో మంది అమ్మాయిలు తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్పు సలహాలు తీసుకుంటుంటారు. ఇటీవల అమ్మాయిల వివాహం, కట్నం వంటి అంశాలపై సింగర్ చిన్మయి వరుస పోస్ట్ లు చేసింది. అమ్మాయిలకు ఇష్టం లేకపోయిన సొంత క్యాస్ట్‏లో వెధవనైనా సరే ఇచ్చి పెళ్లి చేస్తారని… మహిళలను ఆర్థికంగా, స్వేచ్చగా బతుకనివ్వరు అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

Singer Chinmayi

two nri’s supporting singer chinmayi sripada about women issue

Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ క్లీన్ చీట్…

ఎన్నారైలకు కోట్లకు కోట్లు కట్నాలు ఇస్తారు అంటూ చిన్మయి చేసిన పోస్ట్‏కు కొందరు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అందరూ ఎన్నారైలు కూడా అలాంటి వారేనా ? అంటూ కామెంట్స్ చేయగా వారికి తనదైన రీతిలో కౌంటర్స్ ఇచ్చింది చిన్మయి. అయితే ఇదే విషయంపై ఇద్దరు ఎన్నారైలు చిన్మయికి మద్దతుగా నిలిచారట. ఈ విషయాన్ని చిన్మయి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఇద్దరూ ఎన్నారైలు తనకు చేసిన మేసేజ్‏లను స్క్రీన్ షాట్ తీసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మీరు చెప్పినట్టు గానే చాలా మంది ఎన్నారైలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకండి అంటూ వారు ఆమెకు సపోర్ట్ చేశారు. మీరు సరైన దారిలో వెళ్తున్నారని, అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు… ఇది చాలా మంచి పని అంటూ ఆమెని పొగిడారు. మీ మాట విని ఒక్కరు మారిన చాలు.. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలా మంచి విషయం అని చిన్మయికి మద్దతు నిలిచారు. తనకు మద్దతుగా నిలిచిన వారు గోల్డ్ అంటూ కామెంట్ చేసింది చిన్మయి.

Also Read: బాలయ్య బాబు విగ్గు నా మజాకా? అంత ఖర్చు పెట్టారా?