Bigg Boss 6 Telugu Elimination: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 కి ప్రారంభం లో కాస్త మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఇప్పుడు కాస్త ఆసక్తికరమైన టాస్కులతో రోజు రోజుకి గ్రాఫ్ పెంచుకుంటూ మంచి TRP రేటింగ్స్ సాధిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ఇప్పటికే ప్రారంభమై మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో నుండి అభినయ శ్రీ మరియు నేహా రెండవ వారం మరియు మూడవ వారం లో ఎలిమినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు..రేవంత్ , గీతూ రాయల్ , అర్జున్ కళ్యాణ్ , కీర్తి,ఇనాయ సుల్తానా, సుదీప , సూర్య, ఆరోహి రావు మరియు శ్రీహన్ నామినేట్ అవ్వగా వీరిలో ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారో బయటపడిపోయింది..హౌస్ లో ప్రస్తుతం నామినేషన్స్ లో అందరికంటే ఎక్కువ ఓట్లతో ఎవరు ఉన్నారు..తక్కువ ఓట్లతో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు మనం ఈ విశ్లేషణ లో చూడబోతున్నాము.

బిగ్ బాస్ చరిత్ర లోనే మొట్టమొదటిసారి హోస్ట్ చేత నామినేట్ చెయ్యబడ్డ అర్జున్ కళ్యాణ్ మరియు కీర్తి లలో..అర్జున్ కళ్యాణ్ ప్రస్తుతం వోటింగ్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది..కానీ కీర్తి మాత్రం అద్భుతమైన వోటింగ్ తో టాప్ 4 స్థానం లో కొనసాగుతుంది..ఇక అర్జున్ కళ్యాణ్ తో పాటుగా డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టెంట్ ఆరోహి రావు..ఈమె నిన్న మొన్నటి వరుకు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండేది..కచ్చితంగా ఈమె చివరి వరుకు ఉంటుందనే అనుకున్నారు ప్రేక్షకులు..కానీ ఎవ్వరు ఊహించని విధంగా వోటింగ్స్ లో అందరికంటే చివరి స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఈమెనే..అర్జున్ కళ్యాణ్ కి మరియు ఆరోహి రావు కి మధ్య వోటింగ్ తేడా చాలా స్వల్పంగా ఉంది..ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం పక్కా అని మాత్రం తేలిపోయింది..ఎక్కువ శాతం ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ ఆమె హౌస్ లో ఎంతో క్లోజ్ గా ఉండే కంటెస్టెంట్ సూర్య మాత్రం డీసెంట్ వోటింగ్ తో 7 వ స్థానం లో కొనసాగుతున్నాడు..ఇక అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ మొదటి స్థానం లో కొనసాగుతుండగా..ఎవ్వరు ఊహించని విధంగా ఇనాయ సుల్తానా రెండవ స్థానం లో కొనసాగుతుంది..ఇక మూడవ స్థానం లో శ్రీహన్, నాల్గవ స్థానం లో కీర్తి మరియు 5 వ స్థానం లో గీతూ రాయల్ కొనసాగుతున్నారు..ఇక మొదటి వారం నుండి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన రాజ్ శేఖర్ తన ఆతని బాగా మెరుగుపరుచుకోవడం తో వోటింగ్ లైన్ లో ఆరవ స్థానాంకి ఎగబాకాడు..ప్రస్తుతం నామినేట్ అయినా ఇంటి సభ్యుల స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.