Homeఎంటర్టైన్మెంట్OTT Releases This Week: ఒకే రోజు రెండు అద్భుతమైన సినిమాలు.. ఓటీటీ ఆడియన్స్ కి...

OTT Releases This Week: ఒకే రోజు రెండు అద్భుతమైన సినిమాలు.. ఓటీటీ ఆడియన్స్ కి ఇక పండగే!

OTT Releases This Week: ఇటీవల కాలంలో థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటి 2018 . మలయాళం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు, వంద కోట్ల రూపాయిల గ్రాస్ వస్తేనే పెద్ద ఘనత సాధించినట్టు చెప్పుకునే మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కి ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని తెచ్చి పెట్టింది. ఈ చిత్రాన్ని రీసెంట్ గానే తెలుగు లో కూడా దబ్ చేసి ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు బన్నీ వాసు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండే మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. థియేటర్స్ లో మంచి రన్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేసేస్తున్నారు.

ఈరోజు అర్థరాత్రి నుండి ఈ సినిమా సోనీ లివ్ యాప్ లో అన్నీ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. 2018 వ సంవత్సరం లో కేరళ లో సంబంధించిన వరదలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎలా ఈ వరదలు నుండి బయటపడ్డారు అనేది స్టోరీ.

ఇక గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఫారిన్ బాషలలో విడుదలై సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ అనే చిత్రం కూడా రేపటి నుండి డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రెంటల్ బేసిస్ మీద టెలికాస్ట్ స్ట్రీమింగ్ అయ్యేది. ఇక రేపటి నుండి ఈ సినిమా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులోకి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ ని ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version