https://oktelugu.com/

Akshay Kumar Wife: తన పిల్లలు లేచి పోవాలి అంటున్న అక్షయ్ కుమార్ భార్య?

అనంత్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వెళ్లిన అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 11, 2024 / 04:45 PM IST

    Akshay Kumar Wife Twinkle Khanna

    Follow us on

    Akshay Kumar Wife: రీసెంట్ గా అంబానీ ఇంట ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆయన కుమారుడు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు సినీ సెలబ్రెటీలు హాజరైన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి నటీనటులు హాజరై ఎంతో సందడి చేశారు. ఈ వేడుకల్లో అక్షయ్ కుమార్ ఫ్యామిలీ కూడా హాజరైంది. ఇక ప్రత్యేకమైన ఈవెంట్ కు వెళితే వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు స్టార్లు. అదే విధంగా అక్షయ్ కుమార్ భార్య కూడా కొన్ని విషయాలను పంచుకుంది.

    అనంత్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వెళ్లిన అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఏమందంటే..అంబానీ ఈవెంట్ తర్వాత సెలబ్రేషన్స్ ప్రమాణాలు పెరిగాయని..తాను నీతా అంబానీలా డాన్స్ చేయలేను అని పేర్కొంది. దీనికి కారణం చెబుతూ.. తాను చివరిసారిగా తమ్మా తమ్మాకి డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కింద పడి కాలు విరిగిందట.

    ఆ సమయంలో తన భర్త తనతో పాటుగా రాత్రి 10 గంటల వరకు మెలుకవతో ఉండడం కష్టమే అని పేర్కొంది. అయితే తాను సంతోషంగా ఉండాలని తన పిల్లలు కోరుకుంటే.. వారు లేచిపోవడమే బెటర్ అంటూ ఫన్నీగా స్పందించింది అక్షయ్ కుమార్ భార్య. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు పెళ్లి తర్వాత వారి ఇంటి పేరును మార్చుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నామని తెలిపింది ట్వింకిల్ ఖన్నా.

    ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ దంపతులు వారి పిల్లల గురించి చింతిస్తుంటారట. కానీ కొడుకుల గురించి చింత ఉండదు అని రాసుకొచ్చింది. ఇలా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మొత్తం మీద పిల్లలు లేచి పోవాలి అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.