Twinkle Khanna: దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ బెస్ట్ హోస్ట్. కాఫీ విత్ కరణ్ షోతో ఆయన సంచలనాలు చేశాడు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ని సదరు షోలో బోల్డ్ ప్రశ్నలతో అల్లాడిస్తాడు. అలాగే అఫైర్స్ గురించి కూపీ లాగే ప్రయత్నం చేస్తారు. ఆయన సెన్సాఫ్ హ్యూమర్, ప్రజన్స్ ఆఫ్ మైండ్ షోలో హైలెట్ గా నిలుస్తాయి. వేదిక ఏదైన తన మార్క్ స్పీచ్ తో అలరించడం కరణ్ జోహార్ ప్రత్యేకత. అలాంటి కరణ్ జోహార్ ని పబ్లిక్ లో ఇరికించింది, హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.
నటనకు గుడ్ బై చెప్పిన ట్విన్కిల్ ఖన్నా రచయితగా మారారు. ఆమె లేటెస్ట్ బుక్ వెల్కమ్ టు పారడైజ్ లాంచింగ్ ఈవెంట్లో కరణ్ జోహార్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పుస్తకం బాగా అమ్ముడుపోయి డబ్బులు రావాలని కోరుకుంటారా? లేక ఎవరూ కొనకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కితే చాలా? అని కరణ్ జోహార్ ట్వింకిల్ ఖన్నాను అడిగారు. దీనికి సమాధానంగా. నేను కూడా మీలా మారాలి అనుకుంటున్నాను. అప్పుడు కిడ్స్ బర్త్ డే పార్టీలతో రాపిడ్ ఫైర్ ఆడి రూ. 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు, అన్నారు.
ట్వింకిల్ ఖన్నా సమాధానంతో కరణ్ జోహార్ స్టన్ అయ్యాడు. బర్త్ డే పార్టీలకు కరణ్ జోహార్ డబ్బులు వసూలు చేస్తున్నాడని నేరుగా చెప్పినట్లు అయ్యింది. బహుశా నా టీమ్ తో మీరు మాట్లాడుతున్నట్లున్నారు. వాళ్ళు చెప్పకూడని సీక్రెట్ బయట పెట్టేస్తున్నారేమో … అని కరణ్ అన్నారు. ట్వింకిల్ ఖన్నా ఇంకా మాట్లాడుతూ నా భర్త తలనీలాలు వేడుకలకు కూడా హాజరవుతారని చెప్పింది.
మీ హస్బెండ్ నేను ఒకటే. నేను చైల్డ్ బర్త్ డే పార్టీలకు వెళతాను. వాళ్ళు రెండేళ్ల లోపు పిల్లలు. వాళ్లతో నాకు పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు… అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్-ట్వింకిల్ ఖన్నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు కలిసినా ఒకరిపై మరొకరు ఇలా సెటైర్స్ వేసుకుంటారు. అక్షయ్ కుమార్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా తెలుగులో శీను మూవీ చేసింది. మరలా ఆమె తెలుగులో నటించలేదు. 2001 తర్వాత ఆమె నటించలేదు.